ETV Bharat / entertainment

కల్కి న్యూ రిలీజ్ డేట్- ఈసారి పక్కా! - Kalki AD 2898 Release

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 7:32 AM IST

Kalki AD 2898 Release Date
Kalki AD 2898 Release Date

Kalki AD 2898 Release Date: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న కల్కి సినిమా రిలీజ్ గురించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది.

Kalki AD 2898 Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్​ రోల్​లో నటిస్తున్న 'కల్కి 2898 ఏడీ' సినిమా రిలీజ్ డేట్ గురించి మళ్లీ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే మే 9న సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించినా, పలు కారణాల వల్ల కల్కి వాయిదా పడనుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో మూవీ రిలీజ్ గురించి తాజాగా మరోవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమా మేకర్స్ ఇటీవల డిస్టిబ్యూర్లతో సమావేశమయ్యారట. ఈ మీటింగ్​లోనే రిలీజ్ డేట్ గురించి ఓ క్లారిటీకి వచ్చారని తెలుస్తోంది. ఈ క్రమంలో మేకర్స్ సినిమా విడుదలను జూన్ 27కి షిఫ్ట్ చేశారని అంటున్నారు. దీంతో మూవీమేకర్స్​ జూన్ 27 తేదీని లాక్ చేసుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై శనివారం (ఎప్రిల్ 27)న క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కానీ, సినిమా వాయిదా గురించి కానీ, కొత్త రిలీడ్ డేట్​ గురించి కానీ మూవీ యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

యానిమేటెడ్ వీడియో
అయితే 'కల్కి 2898 AD' సినిమా ఎలా ఉంటుంది? సైన్స్​ ఫిక్షన్​ జానర్ అంటే ఏంటి? ఈ అంశాలపై ఓ అవగాహన కల్పించేలా సినిమా థియేటర్లలోకి రాకముందు ఓటీటీలో ప్రీల్యూడ్ వీడియో రిలీజ్ చేయనున్నారు. ఇది యానిమేటెడ్​ వీడియో. ఇందులో ప్రభాస్ క్యారెక్టర్​కు సొంతంగా ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారంట. ఈ వీడియో నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్​ చేసే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ముందుగా సినిమా టీజర్, తర్వాత పాటలు, ఆ తర్వాత ట్రైలర్​ రిలీజ్ చేసి చివరగా ఈ ప్రీల్యూడ్ వీడియో విడుదల చేయనున్నారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను సైన్స్​ ఫిక్షన్ జానర్​లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్​పై అశ్వినీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రభాస్​ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె నటిస్తోంది. దీశా పటనీ, బిగ్​ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు ప్రభాస్ మారుతి 'రాజాసాబ్' సినిమా షూటింగ్​లతో బిజీగా ఉన్నారు. ఇక సలార్ పార్ట్- 2 షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. 2025లో సినిమా థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

డార్లింగ్ ఫ్యాన్స్ గెట్​ రెడీ- 'కల్కి' సాలిడ్ అప్డేట్!- రిలీజ్​పై క్లారిటీ అప్పుడే! - Kalki Release Date

'కల్కి' రూమర్స్​కు చెక్- రిలీజ్​పై క్లారిటీ ఇవ్వనున్న మూవీటీమ్! - Kalki 2898 Ad Release

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.