ETV Bharat / entertainment

పొట్టి పోలీస్ ఆఫీసర్​ అని నాగబాబు ఏ హీరోను అన్నారంటే? - కాంట్రవర్సీపై వరుణ్ క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 1:37 PM IST

Operation Valentine Varuntej Nagababu Controversy Comments : మెగా నటుడు నాగబాబు కొన్ని సార్లు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతుంటాయి. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లోనూ ఆయన చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. ఐదడుగుల హీరోలు కూడా పోలీస్ పాత్రలు చేస్తున్నారంటూ వెటకారంగా అన్నారు. అయితే తాజాగా దీనిపై వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చారు.

పొట్టి పోలీస్ ఆఫీసర్​ అని నాగబాబు ఏ హీరోను అన్నారంటే? - కాంట్రవర్సీపై వరుణ్ క్లారిటీ
పొట్టి పోలీస్ ఆఫీసర్​ అని నాగబాబు ఏ హీరోను అన్నారంటే? - కాంట్రవర్సీపై వరుణ్ క్లారిటీ

Operation Valentine Varuntej Nagababu Controversy Comments : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్ బ్యాక్‌ డ్రాప్​లో తెరకెక్కింది. శక్తిప్రతాప్‌ సింగ్ దర్శకత్వం వహించారు. మానుషి చిల్లర్ హీరోయిన్​గా నటించింది. నవదీప్,మిర్‌ సర్వార్‌ త‌దిత‌రులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అయితే ఈ సారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని వరుణ్​ తేజ్ సినిమాను​ బాగా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

రీసెంట్​గా ప్రీ రిలీజ్ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, తన తండ్రి నాగబాబు చీఫ్​ గెస్ట్​లుగా వచ్చారు. అయిత ఈవెంట్​లో వరుణ్ తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. ఇద్దరు హీరోల అభిమానుల మధ్య గొడవ రేగింది.

ఈ ఈవెంట్​లో ఆరడుగులున్న తన వారసుడిని ప్రశంసించే క్రమంలో ఐదడుగులు ఉన్న వారు కూడా పోలీస్ ఆఫీసర్ రోల్స్​ చేస్తున్నారంటూ నాగబాబు వెటకారంగా మాట్లాడారు. "కొన్ని కొన్ని సార్లు కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక 5 అడుగుల 3 అంగుళాలు ఉన్నవాడు, నేను ఫిట్​ పోలీసాఫీసర్ అంటే కామెడీగా అనిపిస్తుంది. నువ్వు కాదులేరా బాబూ అనిపిస్తుంది." అని ఫ్లోలో అనేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్​గా మారింది. నెట్టింట్లో రామ్​చరణ్ - ఎన్టీఆర్​ అభిమానుల గోల చేయడం మొదలెట్టేశారు. జంజీర్​లో పోలీస్​ అధికారిగా కనిపించిన రామ్​చరణ్​ను అన్నారని అపోజిట్ ఫ్యాన్స్ అంటే, బాద్​ షా సినిమాలో పోలీస్​ ఆఫీసర్​గా నటించిన ఎన్టీఆర్​ను అన్నారని అవతలి పక్క అభిమానులు అంటున్నారు.

ఫైనల్​గా నాగబాబు స్టేట్​మెంట్​తో చెలరేగిన వివాదంపై తాజాగా వరుణ్​ తేజ్ వివరణ ఇచ్చారు. హైట్​కు సంబంధించిన విషయంలో తన తండ్రి చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు. తన హైట్​ 6.3ను దృష్టిలో పెట్టుకుని, పోలిక కోసం 5.3 అడుగులు అన్నారని చెప్పారు. అంతకుమించి మరో హీరోను కించపరచలేదని చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

10ఏళ్ల పాటు డేటింగ్​ - సీక్రెట్​గా పెళ్లి చేసుకోనున్న ప్రముఖ హీరోయిన్!

సడెన్​గా OTTలోకి వచ్చేసిన కిల్లర్ గేమ్ మూవీ - ప్రతీ సీన్ సూపర్ థ్రిల్​తో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.