ETV Bharat / entertainment

కెరీర్​ స్వింగ్​లో ఉండగా ఇండస్ట్రీ నుంచి బ్యాన్- ఆ హీరోయిన్ ఇప్పుడేం చేస్తోందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 12:02 PM IST

సినీ ఇండస్ట్రీలో జీవితాలు ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. మంచి ఛాన్స్ వస్తే ఓవర్ స్టార్ అవుతారు లేకపోతే ఢమాల్ అంటూ కనిపించకుండా పోతారు? అలా స్టార్ స్టేటస్ నుంచి పూర్తిగా జీరోగా మారిన నటి గురించి మీకు తెలుసా? ఆమె ఇప్పుడు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం.

Nikita Thukral Career
Nikita Thukral Career

Nikita Thukral Career: సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో ఎప్పుడు జీరో అవుతారో ఊహించడం కష్టం. అలాంటి కోవకే చెందింది సినీ నటి నిఖితా తుక్రాల్. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో డజన్ల కొద్ది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఓ పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల ఆమె కెరీర్ ​ఇబ్బందుల్లో పడింది.

నిఖితా సినీ ఎంట్రీ ఎలా జరిగింది?
భారతదేశంలో సినిమా పరిశ్రమకు మామూలు క్రేజ్ ఉండదు. సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులను ప్రజలు ఆరాధిస్తూ ఉంటారు. దేశంలో ఆయా సినీ ఇండస్ట్రీల్లో ఎంతో మంది నటీనటులు ఉన్నారు. వారిలో అనేక మంది తమ నటనతో పాపులర్ అయ్యారు. కానీ, జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలతో కెరీర్​లో ఇబ్బందులు ఎదుర్కున్నవారు ఉన్నారు. ఆ లిస్ట్​లో సినీ నటి నిఖితా తుక్రాల్ కూడా ఉంది.

పంజాబీ కుటుంబానికి చెందిన నిఖితా ముంబయిలోని కిషిచంద్ చెల్లారం కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ చేసింది. నిర్మాత రామానాయుడు జుహూలోని ఓ హోటల్​లో ఆమెను చూసి సినిమా ఆఫర్ ఇచ్చారు. 2002లో తీసిన 'హాయ్' చిత్రంలో ఓ పాత్రను ఇచ్చారు. ఆ తర్వాత కల్యాణ రాముడు, డాన్, సంబరం, చింతకాయల రవి సినిమాల్లో నటించింది. ఇలా వరుసNikita Thukral Career ఆఫర్లతో తక్కువ సమయంలోనే నిఖిత మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఓ పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం వల్ల ఆమె కెరీర్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇప్పుడు వెండితెరకు దూరమైంది.

నిఖితా కెరీర్ ఎలా సాగింది?
'హాయ్' చిత్రం తర్వాత నిఖితకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తో 'కైతుమ్ దూరత్' చిత్రంలో నటిచింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత 'కురుంబు, సంబురం'తో తమిళలో ఎంట్రీ ఇచ్చింది. ఈ తర్వాత వెంకట్ ప్రభుతో 'సరోజ'లో యాక్ట్ చేసింది. 'కొడనా కోడి' పాటలో ఆమె డ్యాన్స్, అభినయానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేసింది నిఖిత.

నిఖిత కెరీర్ ఎలా దెబ్బతిన్నది?
2005లో కన్నడ చిత్రసీమలోకి అడుగు పెట్టింది. అదే ఇండస్ట్రీకి చెందిన స్టార్ దర్శన్​తో ఎఫైర్ వల్ల ఆమె కెరీర్ దెబ్బతిన్నట్లు అప్పట్లో ప్రచారం సాగింది. వారిద్దరు కలిసి ఓ సినిమాలో పని చేస్తున్న సందర్భంలో నిఖిత, దర్శన్​తో ఆమె లవ్​లో పడింది. కానీ అప్పటికే దర్శన్​కు పెళ్లి అవ్వడం వల్ల వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్​గా మారింది. ఈ వార్త కన్నడ పరిశ్రమలో సెన్సేషన్​గా మారడంతో పెద్ద దుమారం రేగింది. నిఖితా తుక్రాల్​పై హీరో దర్శన్ భార్య విజయలక్ష్మీ తీవ్ర ఆరోపణలు చేశారు. నిఖితతో రిలేషన్ వల్ల దర్శన్ తనపై గృహహింసకు పాల్పడ్డారని గన్​తో బెదిరించారంటూ విజయలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్శన్, నిఖితనుపై చర్యలు తీసుకున్నారు.

ఇండస్ట్రీ నుంచి బ్యాన్: అనంతరం కన్నడ ఇండస్ట్రీ నిర్మాతల అసోసియేషన్ నిఖితపై 3ఏళ్లపాటు నిషేధం విధించారు. దీంతో ఆమె సినీ కెరీర్​ దెబ్బతింది. నిషేధం ముగిసిన తర్వాత నిఖిత ఇండస్ట్రీ దృష్టిలో పెద్దగా రాణించలేదు. దర్శకుల నుంచి ఎలాంటి ఆఫర్స్ రాకపోవడం వల్ల ఆమె క్రమంగా ఇండస్ట్రీకి దూరమైంది. 2017లో గగన్ దీప్ సింగ్ మాగో అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని హ్యాపీగా జీవిస్తోంది. ప్రస్తుతం నిఖితకు ఒక కుమార్తె కూడా ఉంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఒకప్పుడు స్టార్ హీరో‌ షూస్ మోసిన అసిస్టెంట్‌ - ఇప్పుడు సినిమాకు రూ.100 కోట్లు తీసుకునే స్టార్​!

స్టార్ హీరోయిన్​తో ప్రముఖ నిర్మాత రిలేషన్​షిప్​​ - రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్న భార్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.