ETV Bharat / entertainment

NBK 109 బ్లాస్ట్ అప్డేట్​ - బాలయ్యకు విలన్​గా 'యానిమల్'​ స్టార్​

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 6:50 PM IST

Updated : Jan 27, 2024, 8:54 PM IST

NBK 109 Villian Bobby Deol : బాలయ్య NBK109 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్​ ఇచ్చారు మేకర్స్‌. ఈ సినిమాలో బాలయ్యకు ఎదుర్కొనే విలన్​గా 'యానిమాల్'​ స్టార్​ను రంగంలోకి దించారు.

Etv Bharat
Etv Bharat

NBK 109 Villian Bobby Deol : నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'NBK 109'. డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్​ను ఇచ్చారు మేకర్స్‌. ఈ మూవీలో బాలయ్యను ఢీ కొట్టే విలన్​గా 'యానిమల్‌' స్టార్​ను రంగంలోకి దింపనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ తాజాగా మేకర్స్​ అఫీషియల్ అనౌన్స్​మెంట్ ఇచ్చారు. ఈ చిత్రంలో బాబీ దేఓల్​ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. నేడు(జనవరి 27) బాబీ దేఓల్​ బర్త్‌డే సందర్భంగా ఆయన అప్‌కమింగ్​ చిత్రాలపై అప్‌డేట్స్‌ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ అప్డేట్​ కూడా వచ్చింది.

ఈ అప్డేట్​ చూసిన నందమూరి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. నటసింహానికి సరైన విలన్‌ దొరికాడంటూ, దర్శకుడు బాబీ ఈ మూవీని ఏ లెవల్లో ప్లాన్‌ చేశారో బాబీ దేఓల్​ ఎంపికతోనే అర్థమైపోతుదంటూ కామెంట్లు చేస్తున్నారు. థియేటర్లో పూనకాలు ఖాయమంటూ తెగ సంబర పడిపోతున్నారు.

ఇకపోతే 'భగవంత్‌ కేసరి' తర్వాత నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న చిత్రమిది. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది. ఇప్పటికే 'బ్లడ్‌ బాత్‌కు బ్రాండ్‌ నేమ్‌ - వయలెన్స్‌కు విజిటింగ్‌ కార్డ్‌' అనే క్యాప్షన్‌తో రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కూడా సినీ ప్రియులను బాగా ఆకర్షించింది. సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ పతాకంపై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మిస్తున్నారు.

ఇకపోతే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ కనిపించనున్నట్లు ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. హీరోయిన్​ తమన్నాతో ఓ స్పెషల్‌ సాంగ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టీమ్‌ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. సినిమా వేరే లెవల్‌లో ఉంటుందని దర్శకుడు బాబీ నందమూరి అభిమానులకు హామీ ఇచ్చారు. ఒక సరికొత్త కథతో, డిఫరెంట్‌ ఫ్లాష్‌బ్యాక్‌తో బాబీ ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు అర్థమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.

'దేవర' ఓవర్సీస్​ రైట్స్​ - వామ్మో ఎన్ని కోట్లు అంటే?

నాన్న, నాన్న - 'యానిమల్'లో ఈ పదం ఎన్ని వందల సార్లు వాడారో తెలుసా?

Last Updated :Jan 27, 2024, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.