ETV Bharat / entertainment

కన్నప్పలో ప్రభాస్​ శివుడు కాదట - ఏ పాత్రలో కనిపించనున్నారంటే? - Prabhas Kannappa

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 2:21 PM IST

కన్నప్పలో ప్రభాస్​ శివుడ కాదట - ఏ పాత్రలో అంటే?
కన్నప్పలో ప్రభాస్​ శివుడ కాదట - ఏ పాత్రలో అంటే?

Manchu Vishnu Prabhas Kannappa : కన్నప్ప సినిమా విషయంలో మంచు విష్ణు కన్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఆయన శివుడు పాత్రలో కనిపించనున్నట్టు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కనిపించేంది శివుడి పాత్ర కాదని తెలిసింది. ఇంతకీ ఆయన ఏ పాత్రలో కనిపించనున్నారంటే?

Manchu Vishnu Prabhas Kannappa : టాలీవుడ్​లో భక్త కన్నప్పగా ప్రేక్షకుల గుండెల్లో రెబల్ స్టార్ కృష్ణంరాజు ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. అందుకే మంచి విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో ప్రభాస్ కూడా నటించబోతున్నారని ప్రకటించాక అభిమానులు ఆ చిత్రంపై అంచనాలు పెంచుకున్నారు. అయితే ప్రభాస్ శివుడు పాత్రలో, నయనతార పార్వతీగా ఇందులో కనిపించనున్నారని ప్రచారం జరిగింది. పైగా ప్రభాస్, నయనతార చాలాకాలం తర్వాత ఈ సినిమాలో కలిసి నటించబోతున్నారని అభిమానులు సంబరపడ్డారు. అయితే ఇప్పుడు ప్రభాస్ పాత్ర మారింది అంటూ కొత్త ప్రచారం మొదలైంది.

గత వారం ఈ మూవీ రూమర్​ అప్డేట్స్ ప్రకారం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తొలిసారిగా ఈ సినిమాతో టాలీవుడ్​లోకి అడుగుపెట్టనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఒక ట్రేడ్ అనలిస్ట్ ఈ విషయాన్ని తెలియజేశారు. అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడిగా కనిపించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే బాలీవుడ్​లో ఓ మై గాడ్, ఓ మై గాడ్ 2 సినిమాలలో దేవుడిగా కనిపించిన అక్షయ్ కుమార్ ఈ సినిమాలో కూడా అదే పాత్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓ మై గాడ్ 2లో ఆయన శివుడిగా కనిపించి ఆకట్టుకున్నారు.​

Kannappa Movie Cast and Crew : అందుకే కన్నప్పలోనూ అక్షయ్​ శివుడిగా కనిపించేలా దర్శకుడు స్క్రిప్ట్​ కాస్త మార్చారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రభాస్​ నందీశ్వరుడిగా చూపించే ప్రయత్నం చేయబోతున్నారట. ఇంకా ప్రభాస్​కు సంబంధించిన షూట్ ప్రారంభం కాలేదు. కాగా, పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్​తో పాటు కన్నడ టాప్ హీరో శివ రాజ్ కుమార్, మోహన్ బాబు, మధుబాల, బ్రహ్మానందం, ముకేష్ ఋషి, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ కూడా నటిస్తున్నారు. మొత్తంగా భారీ క్యాస్టింగ్​తో భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది శివరాత్రికి కన్నప్పను థియేటర్లలో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

థియేటర్లలో ఎక్కువ రోజులు ఆడిన తెలుగు సినిమాలు ఇవే? - బాలకృష్ణనే టాప్​! - Longest Movie Run In Theatres

దీపావళి బరిలో 5 భారీ సినిమాలు - బాక్సాఫీస్ ముందు మోతే! - Deepavali 2024 Movies

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.