ETV Bharat / entertainment

గ్రాండ్​గా 'లెజెండ్' మూవీ రీరిలీజ్​ - ఈ బ్లాక్​బస్టర్​ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసా ? - Legend Movie Re Release Trailer

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 6:04 PM IST

Updated : Mar 26, 2024, 11:48 AM IST

Legend Movie Re Release Trailer
Legend Movie Re Release Trailer

Legend Movie Re Release Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్​లో వచ్చిన సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'లెజెండ్​'. ఈ ఏదాడితో ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

Legend Movie Re Release Trailer : నందమూరి నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్​లో వచ్చిన సాలిడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'లెజెండ్​'. 2014లో విడుదలైన ఈ సినిమా అటు ఫ్యాన్స్​కే కాకుండా ఇటు ఆడియెన్స్​కు కూడా గూస్​బంప్స్ తెప్పించింది. బాలయ్య రెండు డిఫరెంట్ వైబ్స్​లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక అందులోని పవర్​ఫుల్ డైలాగ్స్​ కూడా అభిమానులను ఉత్తేజపరిచింది. అయితే ఈ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఏదాడితో ఈ సినిమా సరిగ్గా 10 ఏళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మేకర్స్ ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చి 30న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు మీ కోసం.

  1. బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్​లో విడుదలైన రెండో సినిమా ఇది. అంతకుముందు ఈ ఇద్దరూ కలిసి పని చేసిన 'సింహా' కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్​ సాధించింది.
  2. ఇందులో బాలయ్య డ్యూయెల్​ రోల్​లో మెరిశారు. అందులో ఒకటి జయ్​దేవ్ అలియాస్ లెజెండ్ ఇంకా కృష్ణ. ఈ రెండింటిలోనూ ఆయన డిఫరెంట్ వైబ్స్ అండ్ లుక్స్​తో ఆకట్టుకున్నారు.
  3. ఈ సినిమాతోనే ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు తొలిసారి విలన్ రోల్​లో మెరిశారు. జితేంద్ర అనే రోల్​లో ఆయన కనిపించారు.
  4. తొలుత ఈ సినిమాలోని ప్రతినాయకుని పాత్ర కోసం కోసం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్​ను తొలుత సంప్రదించారట. కానీ కొన్ని కారణాల వల్ల దానికి ఆయన ఓకే చెప్పలేదట.
  5. ఇక ఈ సినిమాలో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీలు సందడి చేశారు. ఫ్లాషబ్యాక్​లో రాధిక ఆప్టే మెరవగా, ప్రెజెంట్​లో సోనల్ చౌహన్ నటించింది.
  6. అప్పట్లోనే ఈ 'లెజెండ్' మూవీ దాదాపు 31 సెంటర్లలో వంద రోజులు ఆడింది. మరో రెండు సెంటర్లలో 175 రోజులు రన్ అయింది.
  7. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమా 2017 వ‌ర‌కు థియేట‌ర్ల‌లో ఆడింది. ప్రొద్దుటూరు జిల్లా అర్వేటిలో 55 రోజులు ఆడింది. ఆ తర్వాత అక్కడ నుంచి అదే ప్రాంతంలోని అర్చన థియేటర్​కు షిఫ్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా అర్చ‌న థియేట‌ర్లో 1000 రోజులు దాటేసి ఏకంగా 1116 రోజులు ఆడి రికార్డుకెక్కింది.
  8. బాలయ్య సినిమాల్లో డబుల్​ సెంచరీ దాటిన సినిమాల్లో 'లెజెండ్'​ కూడా ఒకటి. 'ముద్దుల మావయ్య', 'సమరసింహా రెడ్డి', 'నరసింహ నాయుడు', 'సింహా' తర్వాత ఆ లిస్ట్​లో లెజెండ్ ఐదవ స్థానాన్ని దక్కించుకుంది.

బాలయ్య క్రేజ్​ అలాంటిది మరి - ముంబయిలో ప్రతి ఈవెంట్​లోనూ ఆయన సాంగ్సే! - Balakrishna Craze In Mumbai

బాలయ్య ముందు స్పైడర్​ మ్యాన్ కూడా తక్కువే! - స్టార్​ హీరోయిన్ లవ్​ ప్రపోజల్

Last Updated :Mar 26, 2024, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.