ETV Bharat / entertainment

'బుజ్జి' తో సెల్ఫీ కావాలా?- 'కల్కి' టీమ్ ప్లాన్ అదుర్స్! - Kalki 2898 AD

author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 2:27 PM IST

Selfie With Kalki Bujji: రెబల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన మూవీ 'కల్కి'. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీటీమ్ త్వరలో ప్రమోషన్స్ ప్రారంభించనుంది. ​

Selfie With Kalki Bujji
Selfie With Kalki Bujji (Source: ETV Bharat)

Selfie With Kalki Bujji: సినిమా ప్రమోషన్స్ అంటే అందులో లీడ్ రోల్స్ పోషించినవారో లేదా డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంక ఆ మూవీకి సంబంధించిన ఎవరైనా ఉంటారు. అయితే టాలీవుడ్​లో మొదటిసారి ఒక కార్ మూవీని ప్రమోట్ చేయనుంది. తాజాగా ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా ఆడియెన్స్​కు పరిచయం చేసిన 'బుజ్జి' ఆ ప్రేక్షకుల దగ్గరికే వచ్చి 'కల్కి 2898 AD'ని ప్రమోట్ చేయడానికి సిద్దమైంది. ఐపీఎల్ సీజన్​తో మొదలైన కల్కి సినిమా ప్రచారం ఫ్యూచర్ కార్ బుజ్జి రాకతో ఊపందుకుంది.

ఈ మూవీ మేకర్స్ బుజ్జికి సోషల్ మీడియాలో వచ్చిన రెస్పాన్స్​తో సంతృప్తిగా ఉన్నారని సమాచారం. అందుకే మరో అడుగు ముందుకు వేసి దేశంలో ఉన్న ప్రధాన నగరాల్లో మూవీ యూనిట్​తో పాటు ఈ కారును ప్రమోషన్స్​లో భాగంగా తిప్పుతారంట. తమ నగరాలకు వచ్చినప్పుడు బుజ్జితో సెల్ఫీ తీసుకోవచ్చని ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. మామూలుగా హాలీవుడ్​లోనే మూవీలో ఉన్న ఒక వస్తువుతో ప్రమోషన్స్ చేయడం చూశామని, ఇప్పుడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వల్ల టాలీవుడ్​లో కూడా ఒక సరికొత్త ట్రెండ్ మొదలుకానుందని నెటిజన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బుజ్జిని పరిచయం చేసిన తర్వాత ఆటోమొబైల్ రివ్యూయర్స్​తో పాటు మ్యాగజైన్స్ కూడా ఈ కార్ వీడియోలతో పాటు రివ్యూస్ రాశారు. అంతెందుకు ఈ మధ్యే టాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య కూడా ఈ కార్​లో రైడ్ చేశారు. ఇక ఈ రూ.6 కోట్ల కార్ మూవీ రిలీజ్ కాకముందే ఇంత క్రేజ్ తెచ్చుకుందంటే విడుదల తర్వాత ఎలా ఉండనుందో? ఇక ఈ సినిమా షూటింగ్ పనులన్నీ రీసెంట్​గానే పూర్తయ్యాయి.

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్​లో భాగమైన టెక్నీషియన్లకు మూవీటీమ్ స్పెషల్ గిఫ్ట్ ప్యాక్ ఇచ్చారు. గిఫ్ట్స్​లో నాగ్ అశ్విన్ బొమ్మతో మీమ్స్ వేసిన సరదా టీ షర్ట్, వెండి కృష్ణుడి బొమ్మ, ఒక చైన్, ప్రేమతో నిర్మాణ సంస్థ నుంచి రాసిన ఒక లెటర్, కల్కి బ్యాడ్జ్ ఒకటి ఇచ్చారు. వరల్డ్​వైడ్​గా జూన్ 27న కల్కి గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ప్రభాస్​తో పాటు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్నారు. బిగ్​బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

కల్కి షూటింగ్ కంప్లీట్​​- వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్​- కృష్ణుడి బొమ్మ ఎందుకిచ్చారో? - PRABHAS KALKI

'కల్కి' నుంచి క్రేజీ అప్డేట్!- మూవీ లవర్స్​కు పండగే - Kalki AD 2898

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.