ETV Bharat / entertainment

టెలివిజన్​లోకి షారుక్ బ్లాక్​బస్టర్ మూవీ- ఏ ఛానెల్​లో అంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 10, 2024, 1:00 PM IST

Updated : Mar 10, 2024, 2:06 PM IST

Jawan Television Premiere: బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సూపర్​హిట్ మూవీ జవాన్ టెలివిజన్ ప్రీమియర్స్​కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా ఎప్పుడు, ఏ ఛానెల్​లో రానుందంటే?

Jawan Television Premiere
Jawan Television Premiere

Jawan Television Premiere: బాలీవుడ్ బాద్​షా షారుక్ ఖాన్- అట్లీ కాంబోలో తెరకెక్కిన జవాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. గతేడాది సెప్టెంబర్ 7న గ్రాండ్​గా రిలీజైన ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. వరల్డ్​వైడ్​గా దాదాపు రూ.1148కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో బాద్​షా కెరీర్​లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా జవాన్ నిలిచింది.

ఇక షారుక్​ బర్త్​డే సందర్భంగా 2023 నవంబర్​ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్​ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. ఇక జవాన్ ఓటీటీలోనూ పలు రికార్డులు బ్రేక్ చేసింది. ఓటీటీలో రిలీజైన గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు టెలివిజన్​లో సందడి చేసేందుకు జవాన్ రెడీ అవుతోంది.

తెలుగులో ఈ సినిమా శాటిలైట్ హక్కులు హక్కులు జీ తెలుగు ఛానెల్ దాదాపు రెండు నెలల కిందటే దక్కించుకుంది. కానీ, అప్పటినుంచి కమిన్ సూన్ అంటూ ఊరిస్తూ వచ్చింది. ఇక తాజాగా తొలి ప్రమీయర్ డేట్​ను అనౌన్స్​ చేశారు. జవాన్ మార్చి 17న సాయంత్రం 5.30 గంటలకు టీవీలో ప్రసారం కానున్నట్లు జీ తెలుగు చెప్పింది. ఇక థియేటర్లలో, ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిన జవాన్ టెలివిజన్​లో కూడా అదరగొడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో షారుక్​కు జోడీగా కోలీవుడ్ లేడీ సూపర్​స్టార్ నయనతార నటించింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ చేసింది. సీనియర్ నటుడు విజయ్ సేతుపతి విలన్​ రోల్​లో నటించి ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, రెడ్ చిల్లీస్ ఎంటర్​టైన్​మెంట్స్ బ్యానర్​పై జవాన్ రూపొందింది.

ఏడాదిలో రెండుసార్లు: గతేడాది ఫిల్మ్​ ఇండిస్ట్రీలో షారుక్​కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఒకే ఏడాదిలో ఏకంగా రెండుసార్లు రూ.1000 కోట్ల మార్క్​ను అందుకున్నారు. 2023 జనవరిలో విడుదలైన 'పఠాన్'​ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1050.30 కోట్ల వసూళ్లు సాధించగా, జవాన్ 1148కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఒకే రోజు 3సార్లు పెళ్లి- బాలీవుడ్ బాద్ షా మ్యారేజ్ స్టోరీ తెలుసా?

'షారుక్ దగ్గర 17 ఫోన్లు' - షాకింగ్​ విషయాలు రివీల్​ చేసిన ఫ్రెండ్​

Last Updated :Mar 10, 2024, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.