ఒకే రోజు 3సార్లు పెళ్లి- బాలీవుడ్ బాద్ షా మ్యారేజ్ స్టోరీ తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 1, 2024, 6:37 AM IST

Shah Rukh Khan Marriage Story

Shah Rukh Khan Marriage Story: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్​లో షారుక్​ ఖాన్- గౌరీ జంట ఒకటి. వీరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఈ జంట 1991లో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకకు హాజరైన ముఖ్య అతిథులలో వివేక వాస్వానీ ఒకరు. అయితే రీసెంట్​గా వివేక్ వాస్వానీ, సిద్ధార్ద్ కన్నత్​తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో షారుక్- గౌరీ వివాహం గురించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.

Shah Rukh Khan Marriage Story: బాలీవుడ్ బాద్​షా షారుక్​ ఖాన్​ది లవ్ మ్యారేజ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తన ప్రేయసి గౌరీ ఖాన్​ను 1991లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ జంట మూడు సార్లు పెళ్లి చేసుకున్నారన్న విషయం ఎంత మందికి తెలుసు? అవునండి ఇది నిజమే. షారుక్ తన భార్య గౌరీ ఖాన్​ను మూడుసార్లు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన​​ స్నేహితుడు, నిర్మాత వివేక్ వాస్వానీ ఈ మధ్య ఓ సందర్భంలో దీని గురించి చెప్పారు. మరి ఈ విషయం వెనుకున్న కథేంటంటే?

షారుక్ భార్య గౌరీ పంజాబీ కుటుంబానికి చెందిన మహిళ. దీంతో ఈ జంట హిందూ, ముస్లిం సంప్రదాయాలతో పాటు మూడవసారి పంజాబీ శైలిలో పెళ్లి చేసుకున్నట్లు వివేక్ చెప్పారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఈ మూడు సంప్రదాయాల్లోనూ ఒకే రోజు పెళ్లి జరిగిందంట. అయితే వీరి ప్రేమకు వారి ఇరువురి కుటుంబాలు ఒప్పుకోలేదట. అయినప్పటికీ షారుక్- గౌరీ వారి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి చేసుకున్నట్లు వివేక్ తెలిపారు.

అయితే వారి పెళ్లి జరిగిన కొత్తలో షారుక్ తన పేరెంట్స్​తో ఉండేవారట. ఆ తర్వాత వారు సినీ నిర్మాత అజీజ్ మీర్జాకు చెందిన అపార్ట్‌మెంట్‌లోకి మారినట్లు వివేక్ వాస్వానీ గుర్తుచేసుకున్నారు. ఇక షారుక్​ సతీమణి గౌరీఖాన్ గురించి కూడా పలు విషయాలు గుర్తుచేసుకున్నారు. గౌరీ ఖాన్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆమె అందరినీ గౌరవిస్తుందన్నారు. ఇక షారుక్ కెరీర్​ ప్రారంభంలో తనకు ఎంతో సపోర్ట్​ చేసినట్లు వివేక్ చెప్పారు. కానీ, షారూక్​ సక్సెస్ క్రెడిట్ మాత్రం తను తీసుకోనని అన్నారు.

ఇక 2023 సంవత్సరం షారుక్​ కెరీర్​లో ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ ఏడాది షారుక్ రెండుసార్లు రూ.1000 కోట్ల మార్క్ అందుకొని రికార్డ్ కొట్టారు. 2023 జనవరిలో పఠాన్, జూలైలో జవాన్ సినిమాలతో షారుక్​ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు.​ ఇక ఏడాది చివర్లో విడుదైన డంకీ మిక్స్​డ్ టాక్​తో సరిపెట్టుకుంది.

'షారుక్ దగ్గర 17 ఫోన్లు' - షాకింగ్​ విషయాలు రివీల్​ చేసిన ఫ్రెండ్​

షారుక్​ - నయన్ - సందీప్ వంగాకు ప్రతిష్టాత్మక అవార్డ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.