ETV Bharat / entertainment

ఎట్టకేలకు బాయ్​ఫ్రెండ్​కు మిల్కీ బ్యూటీ గ్రీన్​ సిగ్నల్​ - ఆ పద్ధతిలో వివాహం!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 11:16 AM IST

Updated : Mar 19, 2024, 11:39 AM IST

Tamannaah Bhatiya and VijayVarma Wedding : మిల్కీ బ్యూటీ తమన్నా, విజయ్ వర్మ ప్రస్తుతం లవ్ లైఫ్​ను ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా వీరి వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే... తమన్నా కూడా తమ డెస్టినేషన్ వెడ్డింగ్‎ కోసం ప్లాన్ చేస్తోందట.

ఎట్టకేలకు బాయ్​ఫ్రెండ్​కు మిల్కీ బ్యూటీ గ్రీన్​ సిగ్నల్​ - ఆ పద్ధతిలో వివాహం!
ఎట్టకేలకు బాయ్​ఫ్రెండ్​కు మిల్కీ బ్యూటీ గ్రీన్​ సిగ్నల్​ - ఆ పద్ధతిలో వివాహం!

Tamannaah Bhatiya and VijayVarma Wedding : ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. రీసెంట్​గా మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్, యంగ్ హీరో ఆశిష్​ రెడ్డి సహా పలువురు తారలు మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ల తర్వాత తమన్నా భాటియా, విజయ్ వర్మల పేర్లు వినిపిస్తున్నాయి. వీరి రిలేషన్​షిప్​ గురించి ప్రకటించిన తర్వాత ఈ జంట పెళ్లి ఎప్పుడనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే గత కొంత కాలంగా లవ్ లైఫ్​ను ఎంజాయ్ చేస్తున్న తమన్నా విజయ్ వర్మలు ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.

వీరిద్దరు కలిసి లస్ట్ స్టోరీస్ 2 సిరీస్​లో నటించారు. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో షోలు, ఈవెంట్లలోనూ పాల్గొన్నారు. మొదట్లో కొన్నాళ్లూ ఈ జంట మధ్య ప్రేమ గురించి దాచినా ఆ తర్వాత బహిరంగంగానే తాము ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అనంతరం వీరిద్దరు కలిసి ఎన్నో ఫంక్షన్స్ లోనూ కనిపించారు. ప్రస్తుతం చట్టాపట్టాలేసుకని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రిలేషన్​షిప్​ను వివాహం వరకు తీసుకెళ్తున్నట్లు కూడా చెప్పారు.

అయితే ఈ ఏడాది వీరిద్దరూ వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. తమన్నా పేరెంట్స్ కూడా వీరి మ్యారేజ్​కు ఓకే చెప్పడంతో ప్రస్తుతం వీరు వెడ్డింగ్ డెస్టినేషన్ గురించి సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమన్నా తన వివాహాన్ని అందమైన ప్రదేశంలో చేసుకోవాలని ప్లాన్ చేస్తోందట. ఇందులో భాగంగానే వివాహ వేదికలు, రిసార్ట్​లను పరిశీలిస్తోందట. ఈ మధ్యకాలంలో చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్ జంటలు ఇటలీలో వివాహం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు కూడా ఇటలీలోనే వివాహం చేసుకున్నారు. ఇప్పుడు తమన్నా కూడా తమ వివాహాన్ని ఇటలీలో చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అంటే మొత్తానికి మిల్కీ బ్యూటీ కూడా త్వరలోనే సింగిల్ లైఫ్​కు గుడ్ బై చెప్పి వివాహం బంధంలోకి అడుగుపెట్టబోతుందన్నమాట.

DJ Tillu బోల్డ్​ రోల్​ - స్టేజ్​పైనే అనుపమ స్ట్రాంగ్ ఆన్సర్​

SSMB 29 రిలీజ్ డేట్ - జపాన్​లో మహేశ్​ సినిమాపై జక్కన్న అదిరిపోయే అప్డేట్​

Last Updated : Mar 19, 2024, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.