ETV Bharat / entertainment

'దేవర'లో నా పాత్ర అలాంటిది- సీక్రెట్ రివీల్ చేసిన జాన్వీ! - Janhvi Kapoor Devara

author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 3:30 PM IST

Janhvi Kapoor Devara: 'దేవర' సినిమాలోని తన పాత్ర గురించి వివరించింది హీరోయిన్ జాన్వీ కపూర్. ఏం చెప్పిందంటే?

Devara janhvi Kapoor
Devara janhvi Kapoor (Source: ETV Bharat)

Janhvi Kapoor Devara: జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్‌ మూవీ 'దేవర'. ఈ మూవీలో తారక్ సరసన బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఈ చిత్రంతోనే టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే తాజాగా తన మరో కొత్త చిత్రం 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి' ప్రమోషన్స్​లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దేవర' పాత్ర గురించి తెలిపింది.

'దేవర' చిత్రం భిన్నమైన కథ. ఎంతో అందంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి సినిమా యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఇందులో తంగం అనే పాత్ర చేస్తున్నాను. ఎంతో వినోదాత్మకంగా ఉంటుందీ పాత్ర. ఇప్పటి వరకు సాగిన చిత్రీకరణ చాలా సరదాగా సాగింది. మూవీటీమ్​ అంకిత భావం చూసి ఆశ్చర్యపోయాను. సెట్‌లో ఉన్న వారంతా నాతో ఎంతో ప్రేమగా ఉంటారు. అని జాన్వీ పేర్కొంది.

కాగా, జాన్వీ కపూర్​ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్​లు ఉన్నాయి. వాటిలో 'ఉలజ్', 'సన్నీ సంక్కారీ కీ తుల్సీ కుమారీ' ఉన్నాయి. అవీ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్నాయి. రామ్ ​చరణ్​ - బుచ్చిబాబుతో చేయాల్సిన ఆర్సీ 16 ప్రాజెక్ట్​ ఇంకా సెట్స్​పైకి వెళ్లలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఆమె నటించిన 'మిస్టర్ అండ్ మిసెస్​ మహి' మే 31న రిలీజ్ కానుంది.

ఇక 'దేవర' సినిమా విషయానికొస్తే రీసెంట్​గానే మొదటి సాంగ్​ను రిలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే రెండో సాంగ్​ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. సముద్ర తీరం బ్యాక్​డ్రాప్​తో సాగే యాక్షన్‌ డ్రామా మూవీ ఇది. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఎన్టీఆర్‌ అభిమానులకు ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సినిమాలో శ్రీకాంత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగాన్ని ఏప్రిల్​ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో అక్టోబర్‌ 10కి థియేటర్లలో విడుదల చేయనున్నారు.

'నాకు అలాంటోడే కావాలి - వాడితోనే కలిసి ఉంటా' - Janvi Kapoor Marriage

జాన్వీ కపూర్ ఇంట్లో ఉంటారా? ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే! - Janhvikapoor HOUSE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.