ETV Bharat / entertainment

వీళ్లు రీల్​ లైఫ్​ సూపర్ హీరోలు - ఓటీటీలో స్ట్రీమ్​ అవుతున్న హార్ట్ టచింగ్ బయోపిక్స్ చూశారా? - Biopics In Disney Hotstar

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 6:29 PM IST

Heart Touching Biopics In OTT : ఇప్పుడు ఎక్కడ చూసినా బయోపిక్స్ హవా నడుస్తోంది. మనకు తెలిసిన పలువురు పాపులర్ వ్యక్తుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కే ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్టింగ్​గా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వెండితెరపై వచ్చి పలువురికి స్ఫూర్తినిచ్చిన చిత్రాలు ఏంటో చూద్దామా.

Heart Touching Biopics In OTT
Heart Touching Biopics In OTT (Source : Getty Images)

Heart Touching Biopics In OTT : ఎంతో మంది తమ జీవితాల్లో కష్టాలు ఎదుర్కొని సక్సెస్​ సాధిస్తూ అందరికీ ఇన్​స్పిరేషన్​గా నిలుస్తుంటారు. అలాంటి వారి గురించి తెరపై చూపించేందుకు మేకర్స్ కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. అలా వచ్చినవే ధోనీ ద అన్​టోల్డ్ స్టోరీ, శ్రీకాంత్, మైదాన్. ఇవే కాకుండా ఇలాంటివి ఎన్నో సినిమాలు వెండితెరపై వచ్చి పలువురికి స్ఫూర్తినిస్తూ మెరిశాయి. అవేంటంటే?

1. మధు:
ఆంథోనీ మథు అనే 12 ఏళ్ల కుర్రాడు చెప్పులు లేకుండా బ్యాలెట్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఆ యవకుడు ఓవర్​ నైట్​స్టార్ అయిపోతాడు. అయితే తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అతడు తన సొంత ఊరు వదిలి ఇంగ్లాండ్​కు చేరుకుంటాడు. అక్కడున్న ఓ బ్యాలెట్​ స్కూల్​లో చదువుకుంటాడు. చిన్నప్పటి నుంచి తన గ్రామంలోనే ఉన్నా ఆంథోనీ, బయటి వాతావరణానికి ఎలా అలవాటు పడ్డాడు. అక్కడ ఎదుర్కొన్న సమస్యలను ఎలా పరిష్కరించాడనేదే మిగతా స్టోరీ. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

2. 12th ఫెయిల్:
ఐపీఎస్‌ అధికారి మనోజ్‌ కుమార్‌ శర్మ జీవితం ఆధారంగా అనురాగ్‌ పాఠక్‌ రాసిన పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రం రూపొందింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్‌లోయ ప్రాంతమైన మౌర్యానాకు చెందిన మనోజ్‌ కుమార్‌ శర్మ ( విక్రాంత్ మాస్సే)ది నిరుపేద కుటుంబం. తినడానికి సరిగా తిండి లేని పరిస్థితి. మనోజ్‌ తండ్రి పనిలో నిజాయతీగా ఉన్నాడన్న కారణం వల్ల సస్పెండ్‌ అవుతాడు. చదువులో మనోజ్‌ టాపర్‌ ఏమీ కాదు. పైగా పరీక్షల్లో కాపీ కొట్టమని అతడి పాఠశాల ప్రిన్సిపలే ఎంకరేజ్ చేస్తారు.

ఈ విషయం డీఎస్పీ దుష్యంత్‌ (ప్రియాన్షు ఛటర్జీ)కి తెలియడం వల్ల ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ను పట్టుకుని, జైలుకు పంపుతాడు. అందరూ నిజాయతీగా ఉండాలని విద్యార్థులకు చెబుతారు. సగటు విద్యార్థి అయిన మనోజ్‌ 12వ తరగతి ఫెయిల్ అవుతాడు. డీఎస్పీ దుష్యంత్ మాటలను స్ఫూర్తిగా తీసుకుని మనోజ్‌ ఏం చేశాడు? 12th ఫెయిల్‌ అయినా సివిల్స్‌ వైపు అతడి పయనం ఎలా సాగింది? ఈ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్ల గురించే ఈ సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

3. గౌర్ హరి దస్తాన్:
స్వాత్రంత్య సమరయోధుడు గౌర్ హరి దాస్ జీవిత ఆధారంగా తీసిన బయోపిక్ ఇది. ఒడిశాకు చెందిన ఈయన స్వాతంత్య్ర ఉద్యమంలో తాను పాల్గొన్నానని రుజువు చేస్తూ ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్ పొందేందుకు దశాబ్దాలుగా పొరాడుతారు. ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలను ఈ సినిమాలో చూపించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమ్ అవుతోంది.

4. కౌన్ ప్రవీణ్ తాంబే:
ముంబయికి చెందిన ప్రవీణ్ తాంబే ( శ్రేయాస్ తల్పాడే) క్రికెట్​లో ఆల్‌రౌండర్. పేదరికంతో బాధపడుతున్న అతడు ఎప్పటికైనా రంజీ ట్రోఫిలో ఆడాలని కోరుకుంటాడు. కొన్ని కారణాల వల్ల తనకొచ్చిన అవకాశాలు చేజార్చుకుంటాడు. అయితే రంజీలో ఎలాగైనా ఆడాలంటూ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో అనుకోకుండా అతడికి యాక్సిండెంట్‌ అవుతుంది. దీంతో కాలు ఫ్యాక్చర్ అయ్యి క్రికెట్‌కు దూరం అవుతాడు. అయితే చివరకు 41 ఏళ్ల వయసులో ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ స్ఫూర్తిదాయకమైన జర్నీ సినిమాగా తెరకెక్కి అలరించింది. ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో స్ట్రీమ్ అవుతోంది.

5. ఎడ్డీ ద ఈగల్ :
బ్రిటిష్ స్కై జంపర్ ఎడ్డీ ఎడ్వర్డ్స్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని 1988లో వింటర్ ఒలింపిక్స్​లో చోటు దక్కించుకునే స్థాయికి ఎలా ఎదిగాడనేదే స్టోరీ చిత్రంలో చూడొచ్చు. ప్రతి ఒక్క అడుగు వేయడానికి అతనికి ఉన్న ఆయుధాలు రేపటిపై ఆశ, నిశ్చలమైన సంకల్పం. వీటితో అతను జీవనపోరాటం జరుపుతుండగా ఎదుర్కొన్న సంఘటనలు భావోద్వేగానికి గురి చేస్తుంటాయి. మనపై మనకు నమ్మకముంటే ఏదైనా సాధించగలమని చూపించే సినిమా ఎడ్డీ ద ఈగల్.

6. సెక్రటేరియట్ :
1970స్ నేపథ్యంలో తెరకెక్కిన ఓ విభిన్నమైన చిత్రం ఇది. ఓ లెజెండరీ రేసు గుర్రం, దాని యజమాని పెన్నీ చెనెరీ ట్వీడీల జీవిత కథతో రూపొందిన చిత్రం సెక్రటేరియట్. తన తండ్రి కలలను నిజం చేసేందుకు కుమార్తె చేసిన పోరాటమిది. 25 ఏళ్ల పోరాటం తర్వాత ఆమె ప్రేమగా చూసుకున్న గుర్రంతో కలిసి విజయాన్ని ఎలా సాధించిందనేది సినిమాలో చూడొచ్చు.

7. సూపర్ 30 :
బీహార్​కు చెందిన విద్యావేత్త ఆనంద్ కుమార్ బయోగ్రాఫికల్ డ్రామానే ఈ సూపర్ 30. పోస్ట్​మ్యాన్ కుమారుడైన ఆనంద్ (హృతిక్ రోషన్) గణితంలో నిష్ణాతుడు. అతడికి కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి అడ్మిషన్ వస్తుంది. అయితే పేదరికం కారణంగా ఫీజు కట్టలేక ఆ అవకాశాన్ని వదులుకుంటాడు ఆనంద్. ఐఐటీ కోచింగ్ సెంటర్​ను నిర్వహించే లాలాజీ(ఆదిత్య శ్రీవాస్తవ) ఆనంద్​ను గణిత అధ్యాపకుడిగా నియమించుకుంటాడు.

ఆనంద్ తన నైపుణ్యంతో విద్యార్థులను మేటిగా తయారు చేస్తాడు. తన ప్రతిభ డబ్బున్న వారికి ఉపకరిస్తుందని తెలుసుకున్న ఆనంద్, పేద విద్యార్థుల కోసమే పనిచేయాలని భావిస్తాడు. అర్హత ఉండి డబ్బులేని పేదవారి కోసం ఉచిత శిక్షణా సంస్థను ప్రారంభిస్తాడు. ఈ కోచింగ్ సెంటర్ నడిపించేందుకు ఆనంద్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'ఆ పాత్ర పోషించడం నా కెరీర్​లోనే ప్రత్యేకం'

హిందీ తెరపై తెలుగోడి బయోపిక్​ - సూపర్ రెస్పాన్స్​! - Rajkummar Rao Srikanth Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.