ETV Bharat / entertainment

హిందీ తెరపై తెలుగోడి బయోపిక్​ - సూపర్ రెస్పాన్స్​! - Rajkummar Rao Srikanth Movie

author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 4:15 PM IST

Rajkummar Rao Srikanth Movie : ఈ శుక్రవారం రిలీజైన సినిమాల్లో బాలీవుడ్ చిత్రం శీక్రాంత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీని చూసిన ఆడియెన్స్​ ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో.

Getty Images
Rajkummar Rao (Getty Images)

Rajkummar Rao Srikanth Movie : ఈ శుక్రవారం కృష్ణమ్మ, ప్రతినిధి 2, ఆరంభం అంటూ పలు కొత్త సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలతో పాటు ఓ బాలీవుడ్ మూవీ కూడా విడుదలైంది. ఈ రిలీజ్​ గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదు కానీ ఇప్పుడీ సినిమానే మంచి టాక్ అందుకుంది. ఈ చిత్రాన్ని చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎమోషనల్ బయోపిక్​గా వచ్చిన ఈ సినిమా తెలుగువాళ్ళు గర్వించాల్సిన చిత్రమని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ చిత్రం ఓ తెలుగు వ్యక్తి బయోపిక్‌ కావడం విశేషం. కళ్ళు లేకపోయినా గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగిన ఒక విజేత కథ ఇది. శ్రీకాంత్ పేరుతో వచ్చిన ఈ చిత్రం తొలి రోజే మంచి టాక్​తో పాటు వసూళ్లను కూడా సాధించింది.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు రాజ్ కుమార్ రావు టైటిల్ రోల్ పోషించారు. అయితే రాజ్‌కుమార్ రావు యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కట్టిపడేస్తారు. అలానే ఈ చిత్రంలో బ్లైండ్ స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయారని విమర్శకులు ప్రశంసలు దక్కుతున్నాయి. ఆన పెర్ఫార్మెన్స్‌కు అవార్డులు రావడం ఖాయమని అంటున్నారు.

ఇది శ్రీకాంత్ కథ - 1992 ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ మచిలీ పట్నం తాలూకు సీతారామపురంలో పుట్టారు శ్రీకాంత్ బొల్లా. బ్లైండ్ స్టూడెంట్ శ్రీకాంత్ బొల్ల అయిన ఆయన సైన్స్ చదవాలనే ఆశపడతారు. కానీ, అంథులకు సైన్స్‌లో చదివే అవకాశం లేదని తెలుస్తోంది. మన దేశంలో అవకాశాలు తక్కువని తెలిసినా ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మరీ శ్రీకాంత్​ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లి అక్కడ టాప్ యూనివర్సిటీలో చదువును పూర్తి చేశారు. అంతే కాకుండా చదువు పూర్తయ్యాక భారత్​కు తిరిగొచ్చి బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించారు. తనలాంటి ఎంతోమందికి ఉపాధిని కూడా కల్పించారు. అందుకే ఈయన కథ చాలా మందికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే దీనిని సినిమాగా మలిచారు డైరెక్టర్ తుషార్ హీరానందని.

కాగా, దర్శకుడు తుషార్ హీరానందాని గురించి తెలిసిందే. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలకు రచయితగా పని చేసి ఆయన తాప్సి సాండ్ కి ఆంఖ్ ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. స్కామ్ 2003తో మరింత గుర్తింపు పొందారు. ఇంకా ఈ చిత్రంలో జ్యోతిక, అలాయా ఎఫ్, శరద్ కెల్కర్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, నిధి పర్మర్ హీరానందని సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఫైనల్​గా ఒక్క మాటలో చెప్పాలంటే భావోద్వేగాలతో కూడిన ఒక తెలుగువాడి విజయాన్ని పరిచయం చేసిన మంచి చిత్రంగా ఇది నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బిల్​గేట్స్​ మెచ్చిన ఇండియన్ సినిమా ఏంటో తెలుసా? - ఆ స్టార్ హీరోలంతా రిజెక్ట్ చేశారు! - BILL GATES FAVOURITE MOVIE

'ఎవరు గెలిస్తే నాకెందుకండి' - కల్కితో ముడిపెడుతూ ఎన్నికలపై నాగ్ అశ్విన్​ కామెంట్స్​! - Kalki 2898 AD Nag ashwin

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.