ETV Bharat / entertainment

'దేవర'లో సెకండ్ హీరోయిన్- టాలీవుడ్​లోకి మరాఠీ బ్యూటీ ఎంట్రీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 9:15 AM IST

Updated : Feb 10, 2024, 9:43 AM IST

Devara Second Heroine
Devara Second Heroine

Devara Second Heroine: జూనియర్ ఎన్​టీఆర్ దేవర పార్ట్​-1లో జాన్వీ కపూర్​తో పాటు మరో హీరోయిన్​ కూడా టాలీవుడ్​కు పరిచయం కానుందట. ఇంతకీ ఆమె ఎవరంటే?

Devara Second Heroine: యంగ్ టైగర్ ఎన్​టీఆర్- కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో 'దేవర' తెరకెక్కుతోంది. దర్శకుడు కొరటాల ఈ సినిమాను కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రెండు పార్ట్​లుగా డిజైన్ చేస్తున్నారు. రీసెంట్​గా మూవీమేకర్స్​ ఓ గ్లింప్స్​ వీడియో రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్​కు ఆడియెన్స్ ​నుంచి మంచి రెస్పాన్స్​ వస్తోంది. ఇక అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ టాలీవుడ్​కు పరిచయం కానుంది. ఎన్​టీఆర్​తో జాన్వీ స్క్రీన్ షేర్ చేసుకోనుంది. అయితే రీసెంట్​గా ఈ సినిమా గురించి మరో వార్త వైరలవుతోంది. ఈ సినిమాలో మరో హీరోయిన్​ కూడా ఉండనుందట.

'దేవర'తో ఓ మరాఠీ నటి కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నట్లు ప్రచారం సాగుతోంది. మరాఠీ బ్యూటీ శ్రుతి మరాటే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్​గా నటించనుందట. 'దేవర'లో హీరో ఎన్​టీఆర్ డ్యుయల్ రోల్​ చేయనున్నారట. అందులో ఒక రోల్​కు జాన్వీ హీరోయిన్​గా నటించగా, రెండో పాత్రకోసం శ్రుతి మరాటే జతకట్టనుందని టాక్. కానీ, ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ విషయాన్ని ఎన్​టీఆర్ ఫ్యాన్ పేజ్​లో షేర్ చేశారు. ఈ పోస్ట్​కు​ నటి శ్రుతి కూడ స్పందించడం వల్ల ఇది నిజమేనని అంటున్నారు.

ఎన్​టీఆర్​ ఫ్యాన్​ పేజ్​ను స్టోరీలో షేర్ చేసిన శ్రుతి
ఎన్​టీఆర్​ ఫ్యాన్​ పేజ్​ను స్టోరీలో షేర్ చేసిన శ్రుతి

Devara Release: ఈ సినిమాను ఏప్రిల్ 5న గ్రాండ్​గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. అయితే మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్​ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలో విలన్​ రోల్​ చేస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇటీవల గాయపడ్డారు. దీంతో ఆయన పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్​కు రావడానికి కొంత టైమ్ పట్టేలా ఉందట. మరోవైపు షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని, వీఎఫ్​ఎక్స్​ వర్క్స్​ పెండింగ్​లో ఉన్నట్లు సమాచారం.

Devara Movie Cast: ఈ సినిమాలో ఎన్​టీఆర్​, జాన్వీ కపూర్​తో పాటు సైఫ్ అలీ ఖాన్​ నటిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాశ్ రాజ్, షైన్​ టామ్ చాకో, చైత్ర రాయ్ లాంటి స్టార్స్​ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువసుధ, ఎన్​టీఆర్​ బ్యానర్స్​పై సంయుక్తంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్​లో రూపొందుతోంది. అనిరుధ్ రవిచంద్రన్ దేవరకు మ్యూజిక్ అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'దేవర' ఓవర్సీస్​ రైట్స్​ - వామ్మో ఎన్ని కోట్లు అంటే?

ట్యాగ్ మార్చుకున్న 'దేవర' - జూనియర్ ఎన్టీఆర్​ కొత్త పేరేంటో తెలుసా?

Last Updated :Feb 10, 2024, 9:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.