ETV Bharat / entertainment

'ఆ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు - దానికి అతడే కారణం' - Deepika Padukone Remuneration

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 28, 2024, 5:20 PM IST

Deepika Padukone First Movie Remuneration : స్టార్ హీరోయిన్ దీపికా పదుకుణె తన తొలి బాలీవుడ్​ సినిమా కోసం రెమ్యూనరేషన్​ తీసుకోలేదట. ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అసలు ఎందుకు అలా చేసిందో చెప్పుకొచ్చింది. ఆ విశేషాలు మీ కోసం.

Deepika Padukone First Movie Remuneration
Deepika Padukone First Movie Remuneration

Deepika Padukone First Movie Remuneration : సూపర్ స్టార్​ పక్కనే తొలి సినిమా. ఈ మాట విన్న ఏ నటి అయినా ఎగిరి గంతేస్తుంది. దీపికా పదుకుణె కూడా అలానే చేసింది. తన తొలి సినిమా బీటౌన్ బాద్​షా షారుక్​ఖాన్​తో సినిమా అనేసరికి ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. డ్రీమ్​గర్ల్ శాంతిప్రియగా మెరిసి యువతను మైమరిపించింది. దీంతో తొలి సినిమాతోనే ఈ అమ్మడు ఓవర్​నైట్ స్టార్ అయిపోయింది. అయితే ఆ చిత్రానికి ఒక్క రూపాయి కూడా రెమ్యూరేషన్ తీసుకోకుండానే నటించిందట. దీనికి గల కారణం ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

షారూక్​తో కలిసి సినిమా చేయడమే ఆమె పెద్ద గిఫ్ట్​గా భావించానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే కన్నడ చిత్రం 'ఐశ్వర్య'తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది దీపికా పదుకొణె. ఆ తర్వాతనే బీటౌన్​లోకి ఎంట్రి ఇచ్చింది. తొలి సినిమాతో ఎంతో మంది డైరెక్టర్లకు క్లిక్ అయిన ఈ స్టార్​, ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ బాలీవుడ్​లోకి టాప్ హీరోయిన్​గా ఎదిగింది. హిందీలోనే కాకుండా తమిళ, కన్నడ సినిమాల్లోనూ మెరిసింది. హాలీవుడ్​లోనూ పాపులరైంది. ఇప్పుడు 'కల్కి 2898 ఏడీ' సినిమాతో టాలీవుడ్​ ఆడియెన్స్​ను పలకరించనుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆ సినిమాలన్నీ వంద కోట్ల క్లబ్​వే
ఇప్పటి వరకు ఆమె కెరీర్​లో రూ.100 కోట్ల వసూలు చేసిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి. 'లవ్ ఆజ్ కల్' (రూ.117.27 కోట్లు), 'రేస్ 2' (రూ.162 కోట్లు), 'కాక్ టైల్' (121.78 కోట్లు),'యే జవానీ హై దివానీ' (రూ.318 కోట్లు), 'గోలియోం కీ రాస్​లీలా రామ్ లీలా' (రూ. 218.07 కోట్లు), 'చెన్నై ఎక్స్​ప్రెస్' (రూ.422 కోట్లు), 'పీకూ' (రూ.141.30 కోట్లు), 'హౌజ్ ఫుల్' (రూ.124.50 కోట్లు), 'పద్మావత్' (రూ.585 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్' (రూ.397 కోట్లు), 'బాజీరావ్ మస్తానీ' (రూ.184 కోట్లు), '83' (రూ.193 కోట్లు), 'ఫైటర్' (రూ.358 కోట్లు) ఇవే కాకుండా ఇటీవలే విడుదలైన 'పఠాన్', 'జవాన్' సినిమాలు వెయ్యి కోట్ల క్లబ్​లోకి చేరిపోయాయి.

ప్రమోషనల్ ఈవెంట్స్​కు నో చెప్పిన దీపికా! - కారణం ఏంటంటే ?

'తిండి కోసం కష్టపడ్డా - అర్ధరాత్రుళ్ల దాకా పని చేసి క్యాబ్​లో నిద్రపోయా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.