ETV Bharat / entertainment

ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్​ - చూస్తే కాలర్ ఎగరేయాల్సిందే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 11:43 AM IST

Mokshagna New Slim Look : నందమూరి నటసింహం బాలయ్య తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించి చర్చ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. అలానే ఆయన లుక్స్​ గురించి కూడా ఎప్పుడు ఫ్యాన్స్ మాట్లాడుకుంటూనే ఉంటుంటారు. తాజాగా ఆయనకు సంబంధించి లేటెస్ట్ లుక్ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఆయన మరింత స్లిమ్​గా మారిపోయారాయన. ఫేస్ కూడా ఎంతో ఫ్రెష్​గా స్టైలిష్​గా కనిపిస్తోంది. దీంతో అందరూ యంగ్ లయన్ సిద్ధమవుతోందని సంబరపడిపోతున్నారు.

ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ లేటెస్ట్ లుక్​ - ఫ్యాన్స్​ కాలర్ ఎగరేసుకునే రేంజ్​లో!
ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ లేటెస్ట్ లుక్​ - ఫ్యాన్స్​ కాలర్ ఎగరేసుకునే రేంజ్​లో!

Mokshagna New Slim Look : తెలుగు సినీ ఇండస్ట్రీలో గత నాలుగేళ్లుగా ఎప్పుడు రెగ్యులర్​గా జరిగే చర్చ ఏదన్నా ఉందంటే అది నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ గురించే. అభిమానుల్లో తరచూ ఈ చర్చ జరుగుతూనే ఉంది. ఇదిగో వచ్చేస్తున్నాడు అదిగో వచ్చేస్తున్నాడు అంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆయన ఆరంగేట్రం మాత్రం వాయిదా పడుతూనే ఉంటుంది. కనీసం ఈ ఏడాది అయినా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఉంటుందేమోనని నందమూరి అభిమానులంతా బలంగా ఆశిస్తూనే ఉన్నారు.

ఆ మధ్యలో మోక్షజ్ఞ లాంఛ్ కోసం మాస్ డైరెక్టర్​ బోయపాటి శ్రీను, ఫన్ డైరెక్టర్​ అనిల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఇంకా ఎవరితోనూ ఫైనలైజ్ కాలేదు. అయితే మోక్షజ్ఞ మాత్రం గతంలో కన్నా ఈ మధ్య ఎక్కవుగా కెమెరా కంటికి చిక్కుతున్నారు. బాలయ్య సినిమా సెట్స్​లోనూ కనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఫంక్షన్స్​లో సందడి చేస్తున్నారు. ఆ మధ్యన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోదరి కొడుకు పెళ్ళిలోనూ కనిపించారు. ఇన్ని సార్లు ఎక్కువగా కనిపించేసరికి ఆయన సినిమా ఎంట్రీ కోసం రెడీ అవుతున్నారనే గాసిప్స్​ మరింత ఎక్కువైపోయాయి. అదే సమయంలో ముఖ్యంగా ఆయన లుక్స్​ గురించి పెద్ద చర్చే అవుతోంది.

మొదట్లో మోక్షజ్ఞ బాగా బొద్దుగా కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు గత కొంతకాలంగా రోజు రోజుకి ఆయన స్లిమ్​గా మారిపోతూ అభిమానుల్లో ఆనందాన్ని నింపుతున్నారు. హీరో కటౌట్​గా మారుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరింత స్లిమ్​గా మారిపోయారాయన. ఫేస్ కూడా ఎంతో ఫ్రెష్​గా స్టైలిష్​గా కనిపిస్తోంది. కాస్త గడ్డం పెంచి కూడా ఉన్నారు. ఈ లుక్​లో మోక్షజ్ఞను నందమూరి అభిమానులు చూసి పండగ చేసుకుంటున్నారు. ఆయన బాడీ ట్రాన్స్​ఫర్మేషన్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యంగ్ లయన్ సిద్ధం అవుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కన్నా మోక్షజ్ఞనే ఎక్కువ స్టైలిష్​గా ఉన్నారంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఫుల్ ఖుషీ అవుతున్నారు. చూడాలి మరి ఈ ఏడాదైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందో లేదో.

ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ఞ  లేటెస్ట్ లుక్
ట్రెండింగ్​గా యంగ్ లయన్​ మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్

హ్యాపీ బర్త్​ డే అనుపమ - టిల్లుగాడి దెబ్బకు మందు కొడుతూ - మసాలా డోస్​తో గ్లామర్ షో

షాకింగ్ : చావు నుంచి తప్పించుకున్న రష్మిక - వామ్మో ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.