ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్ అర్హతతో SAILలో 314 ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 10:23 AM IST

SAIL Engineering Jobs 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా లిమిటెడ్​ 314 ఓసీటీటీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SAIL Recruitment 2024
SAIL Engineering Jobs 2024

SAIL Engineering Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) 314 ఆపరేటర్-కమ్​-టెక్నీషియన్ ట్రైనీ (ఓసీటీటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి.

ఓసీటీటీ ఉద్యోగాల వివరాలు

  • మెటలర్జీ - 57 పోస్టులు
  • ఎలక్ట్రికల్ - 64 పోస్టులు
  • మెకానికల్ - 100 పోస్టులు
  • ఇన్​స్ట్రుమెంటేషన్ - 39 పోస్టులు
  • సివిల్ - 18 పోస్టులు
  • కెమికల్ - 18 పోస్టులు
  • సిరామిక్ - 6 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్ - 8 పోస్టులు
  • కంప్యూటర్/ఐటీ - 20 పోస్టులు
  • డ్రాఫ్ట్స్​మెన్​ - 2 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 314

విద్యార్హతలు
SAIL Jobs Eligibility : సివిల్​, మెకానికల్​, కెమికల్​, సిరామిక్​, మెటలర్జీ, ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రికల్ అండ్​ ఎలక్ట్రానిక్స్​, ఇన్​స్ట్రుమెంటేషన్​/ ఇన్​స్ట్రుమెంటేషన్​ అండ్ ఎలక్ట్రానిక్స్​, ఎలక్ట్రానిక్స్​ అండ్ టెలికమ్యునికేషన్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్​ విభాగాల్లో ఇంజినీరింగ్ చేసి ఉండాలి. ఓసీటీటీ డ్రాఫ్ట్స్​మెన్​ పోస్టులకు ఒక ఏడాదిపాటు డ్రాఫ్ట్స్​మెన్​గా పని చేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి
SAIL Jobs Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
SAIL Job Application Fee :

  • జనరల్​, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్​ (ఈడబ్ల్యూఎస్​) కేటగిరీకి చెందిన అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, డిపార్ట్​మెంటల్ క్యాండిడేట్స్​, ఎక్స్​-సర్వీస్​మెన్​ దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
SAIL Jobs Selection Process : అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థుల డాక్యుమెంట్స్​ను వెరిఫై చేస్తారు. అన్నీ క్లియర్​గా ఉన్న అభ్యర్థులను ఓసీటీటీ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
SAIL OCTT Job Salary : ఆపరేటర్-కమ్​-టెక్నీషియన్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.16,100 నుంచి రూ.26,600 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం
SAIL OCTT Job Application Process :

  • అభ్యర్థులు ముందుగా సెయిల్​ అధికారిక వెబ్​సైట్​ https://sailcareers.com/ ఓపెన్ చేయాలి.
  • మీరు కొత్త యూజర్ అయితే వన్​ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకోవాలి.
  • అప్పుడు మీకు ఒక యూజర్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • ఈ యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్​ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SAIL OCTT Job Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2024 ఫిబ్రవరి 26
  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మార్చి 18

ఇండియన్ నేవీలో 254 ఆఫీసర్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

డిగ్రీ అర్హతతో 3000 బ్యాంకింగ్ ఉద్యోగాలు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.