ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - రైల్వేలో 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 10:09 AM IST

RRB Technician Jobs 2024 : రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RRB technician Jobs 2024
RRB Recruitment 2024

RRB Technician Jobs 2024 : రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ (ఆర్​ఆర్​బీ) 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుది.

ఉద్యోగాల వివరాలు

  • టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ : 1100 పోస్టులు
  • టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్​ : 7900 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 9000

విద్యార్హతలు
RRB Technician Job Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుంది.

వయోపరిమితి
RRB Technician Job Age Limit :

  • టెక్నీషియన్​ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 36 ఏళ్లు మధ్యలో ఉండాలి.
  • టెక్నీషియన్​ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్లు - 33 ఏళ్లు మధ్యలో ఉండాలి.

పరీక్ష ఫీజు
RRB Technician Job Application Fee :

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు పరీక్ష ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • మహిళలు, మాజీ సైనికులు, ఈబీసీ, మైనారిటీ, ట్రాన్స్​జెండర్​, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
RRB Technician Selection Process : అభ్యర్థులకు ఫస్ట్, సెకండ్ స్టేజ్​ల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. తరువాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి, వీటన్నింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను టెక్నీషియన్ పోస్టులకు ఎంపిక చేస్తారు. వీరు దేశంలో రైల్వే రీజియన్లలో ఎక్కడైనా పని చేయాల్సి ఉంటుంది.

ఆర్​ఆర్​బీ రీజియన్స్​
అహ్మదాబాద్​, అజ్మేర్​, బెంగళూరు, భోపాల్​, భువనేశ్వర్​, బిలాస్​పుర్​, చండీగఢ్​, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్​, కోల్​కతా, మాల్దా, ముంబయి, ముజఫర్​పుర్​, పట్నా, ప్రయాగ్​రాజ్​, రాంచీ, సికింద్రాబాద్​, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్​పుర్​.

జీతభత్యాలు
RRB Technician Salary :

  • టెక్నీషియన్ గ్రేడ్​-1 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,200 వేతనం ఉంటుంది.
  • టెక్నీషియన్ గ్రేడ్​-3 సిగ్నల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.19,900 వేతనం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు :
RRB Technician Jobs 2024 Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి 9
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఏప్రిల్​ 8

నోట్​ : రీజియన్లవారీ పోస్టుల వివరాలు, విద్యార్హతలు, సిలబస్​, రాత పరీక్ష తేదీల వివరాలు, పూర్తి నోటిఫికేషన్​లో విడుదల చేసే అవకాశం ఉంది.

SBIలో 131 'స్పెషలిస్ట్' ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

ఇంటర్​ అర్హతతో ఇండియన్ కోస్ట్​ గార్డ్​లో 260 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.