ETV Bharat / education-and-career

ఆన్​లైన్ ఇంటర్వ్యూకు సిద్ధమవుతున్నారా? ఈ 6-టిప్స్ పాటిస్తే జాబ్​ రావడం గ్యారెంటీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 11:28 AM IST

Online Interview Tips : మీరు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారా? ఆన్​లైన్​ ఇంటర్వ్యూకు పిలుపు వచ్చిందా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్ ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయాలి? ఏమేమి చేయకూడదు? అనే టిప్స్ మీ కోసం.​

online interview tips for students
online interview tips for freshers

Online Interview Tips : నేటి కాలంలో చాలా కంపెనీలు ఉద్యోగుల ఎంపిక కోసం ఆన్​లైన్ ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. సరైన నైపుణ్యాలు ఉన్న వ్యక్తులను కేవలం వర్చువల్​ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకుంటున్నాయి. అందుకే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నవారు, ఆన్​లైన్ ఇంటర్వ్యూల పట్ల కచ్చితంగా అవగాహన పెంచుకోవాలి.

1. డ్రెస్సింగ్ సెన్స్​ : ఆన్​లైన్ ఇంటర్వ్యూ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఆహార్యం (డెస్సింగ్ సెన్స్) విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రొఫెషనల్​గా డ్రెస్​ చేసుకోవాలి. ఇందుకోసం అమ్మాయిలు అయితే చీర కట్టుకోవచ్చు. లేదా కార్పొరేట్ లుక్ కోసం సూట్ వేసుకోవచ్చు. అబ్బాయిలు అయితే చక్కగా షూట్​, బూట్ వేసుకోవాలి. లేదా ప్లెయిన్​ ఫుల్​ హ్యాండ్ షర్ట్​, ప్యాంట్స్​ వేసుకోవాలి. కానీ జీన్స్, టీ-షర్ట్స్​ వేసుకోకూడదు. తల నీట్​గా దువ్వుకోవాలి. కూర్చునే పద్ధతి కూడా బాగుండాలి. కుర్చీలో జారినట్లుగా కూర్చోకూడదు. నీరసంగా కనిపించకూడదు. నిటారుగా, నిండైన ఆత్మవిశ్వాసంతో కూర్చోవాలి. వీటితోపాటు వృత్తి నైపుణ్యాలను కూడా ప్రదర్శించాలి. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా, మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది.

2. సరైన ప్రదేశంలో కూర్చోవాలి : సాధారణంగా మన ఇంట్లోనే కూర్చొని ఆన్​లైన్ ఇంటర్వ్యూలో పాల్గొంటూ ఉంటాం. కానీ మీరు ఎక్కడపడితే అక్కడ కూర్చోకూడదు. ఒక ప్రత్యేకమైన గదిలో, బాగా వెలుతురు ఉన్న చోట కూర్చోవాలి. ఇంటర్వ్యూ జరిగే సమయంలో మీ గదిలోకి ఎవరూ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా అనవసర శబ్దాలు, అంతరాయాలు రాకుండా జాగ్రత్తపడాలి. మీ ఇంట్లో వాళ్లకు ముందే చెప్పి, ఇంటర్వ్యూ సమయంలో ఎవరూ ఆ గదిలోకి రాకుండా చూసుకోవాలి.

3. నెట్​వర్క్ బాగుండేలా చూసుకోవాలి : ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్నెట్‌ అంతరాయం ఏర్పడకుండా చూసుకోవాలి. లేదంటే తరువాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూ జరిగే సమయంలో నెట్‌ వేగం తగ్గిపోవడం, డిస్‌-కనెక్ట్‌ అయిపోవడం లాంటి సమస్యలొస్తే ఇటు మీకు, అటు ఇంటర్వ్యూ చేసిన వారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇలాంటి నెట్​ సమస్యలేవీ లేకుండా ఉండాలంటే, ఇంటర్నెట్‌ సిగ్నల్‌కి సమీపంలో కూర్చోవాలి. మీ ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపు కుటుంబ సభ్యులు ఎవ్వరూ నెట్‌ వాడకుండా చూసుకోవాలి.

4. ముందే ప్రిపేర్​ కావాలి : మొదటిసారిగా ఆన్​లైన్​ ఇంటర్వ్యూలో పాల్గొనేవారికి, కాస్త భయంగా ఉండడం సహజమే. మరికొందరికి ఎదుటివాళ్లతో మాట్లాడడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారు అందరూ ముందుగా మాక్​ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలి. ఇంట్లో అద్దం ముందు కూర్చొని రిహార్సల్స్ చేయాలి. లేదా మీ ఉపాధ్యాల, స్నేహితుల సహాయం తీసుకోవాలి. అలాగే వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రశ్నలు వేస్తే, వెంటనే జవాబు చెప్పేలా ప్రిపేర్ కావాలి. అప్పుడే భయంపోయి, ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ చేయగలరు.

5. ఈ జాగ్రత్తలు తప్పనిసరి :

  • ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ జరిగే సమయంలో దిక్కులు చూడకూడదు. సమాధానాలు చెప్పేటప్పుడు అటూ, ఇటూ, పైకీ, కిందకి చూడకూడదు. నేరుగా ఇంటర్వ్యూ చేసే వాళ్లను చూస్తూ, చిరునవ్వుతో జవాబులు చెప్పాలి. అప్పుడే మీపై వారికి సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది.
  • ఇంటర్వ్యూల విషయంలో సమయపాలన చాలా ముఖ్యం. అందువల్ల ముఖాముఖికి ఓ అరగంట ముందుగానే కంప్యూటర్​ ముందు కూర్చొని, నెట్​వర్క్, లైటింగ్​, సౌడింగ్ సహా అన్ని విషయాలు చెక్​ చేసుకోవాలి. ముందుగానే కాస్త రిహార్సల్స్ కూడా చేసుకోవాలి. దీని వల్ల టెక్షన్ పోతుంది. ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూ చేయడానికి వీలవుతుంది.
  • ఇంటర్వ్యూ పూర్తి అయ్యాక సదరు కంపెనీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ మెయిల్​ పంపించండి. చాలా మంది ఎంపికైతే, కంపెనీ వాళ్లే మెయిల్ పంపిస్తారు అని అనుకుంటారు. కానీ మీరు థ్యాంక్స్ చెబుతూ మెయిల్ పెట్టడం వల్ల, మీపై సదాభిప్రాయం ఏర్పడుతుంది. మీరు వారి కంపెనీలో పనిచేయడానికి ఉత్సాహంగా ఉన్నారని కూడా వారికి అర్థమవుతుంది.

6. ఫెయిల్ అయితే పరిస్థితి ఏమిటి?
సక్సెస్​, ఫెయిల్యూర్స్​ అనేవి సర్వసాధారణం. మీరు మొదటిసారి ఇంటర్వ్యూలో ఫెయిల్ అయినంత మాత్రాన నిరాశ పడాల్సిన అవసరం లేదు. మీలోని లోపాలను సరిదిద్దుకోండి. అప్పుడే మీరు సక్సెస్ కావడానికి అవకాశం పెరుగుతుంది. కనుక ఈ టిప్స్​ అన్నింటినీ పాటిస్తూ ముందుకు సాగండి. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్​ ది బెస్ట్​!

నాన్​-ఇంజినీరింగ్ జాబ్స్​ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్​-10 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్​-5 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.