ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - నవోదయ జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు - ఇలా అప్లై చేసుకోండి! - Navodaya Vidyalaya Samiti jobs

author img

By ETV Bharat Telugu Team

Published : May 1, 2024, 1:48 PM IST

Navodaya Vidyalaya Samiti : నవోదయ విద్యాలయాల్లో నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే వారికి గుడ్ న్యూస్. నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30తో గడువు ముగియగా.. ఈ తేదీని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. త్వరపడండి.. ఇలా దరఖాస్తు చేసుకోండి.

Navodaya Vidyalaya Samiti
Navodaya Vidyalaya Samiti

Navodaya Vidyalaya Samiti Recruitment 2024 : నవోదయ విద్యాలయ సమితి 1377 నాన్​-టీచింగ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్‌ ప్రకారం ఏప్రిల్‌ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ తేదీని మే 7వరకు పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఎలా అప్లై చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం..

ఉద్యోగాల వివరాలు:

  • ఫిమేల్‌ స్టాఫ్ నర్స్ పోస్టులు - 121
  • అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ - 5
  • ఆడిట్‌ అసిస్టెంట్ - 12
  • జూనియర్ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్ - 4
  • లీగల్ అసిస్టెంట్ - 1
  • స్టెనోగ్రాఫర్ - 23
  • కంప్యూటర్ ఆపరేటర్‌ - 2
  • క్యాటరింగ్ సూపర్‌వైజర్ - 78
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 381
  • ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ - 128
  • ల్యాబ్ అటెండెంట్ 161
  • మెస్ హెల్పర్ - 442
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 19

అర్హతలు(Navodaya Non-Teaching Jobs Qualification): పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి(Navodaya Non-Teaching Jobs Age Limit): అభ్యర్థుల వయసు ఆయా పోస్టులను బట్టి మారుతుంటుంది. అయితే అన్ని పోస్టులకు కలిపి కనిష్ఠ వయస్సు 18 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 40 ఏళ్లు ఉంటుంది. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.

అప్లికేషన్​ ఫీజు(Navodaya Non-Teaching Jobs Application Fee):

  • ఫిమేల్ స్టాఫ్ నర్స్​ పోస్టులకు.. జనరల్​, OBC, EWS​ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు రూ.1500 కాగా, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
  • మిగతా అన్ని పోస్టులకు జనరల్​, EWS, OBC అభ్యర్థులు రూ.1000 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం(Navodaya Non-Teaching Jobs Selection Process): రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్​ మార్కింగ్​ ఉంది. అంటే తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు.

పరీక్ష కేంద్రాలు(Navodaya Non-Teaching Jobs Exam Centers): తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్​ను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు.

అప్లై చేసుకునే విధానం: How to Apply for Navodaya Non Teaching Jobs

  • ముందుగా నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్​సైట్​కు లాగిన్​ అవ్వాలి. ఈ లింక్​పై క్లిక్​ చేయండి.
  • మీరు ఇంతకుముందే రిజిస్ట్రేషన్​ చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్​ అయ్యి అప్లికేషన్​ ఫామ్​ ఫిల్ చేసి ఫీజు పేమెంట్​ చేసి అన్ని వివరాలూ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్​ చేస్తే మీ అప్లికేషన్​ సక్సెస్​ అవుతుంది.
  • ఒకవేళ మీరు కొత్తగా రిజిస్ట్రర్​ చేసుకోవాలనుకుంటే స్క్రీన్​ మీద కనిపించే New Candidate Register Here ఆప్షన్​పై క్లిక్​ చేసి అడిగిన వివరాలు ఎంటర్​ చేసి రిజిస్ట్రేషన్​ పూర్తి చేసుకోవాలి.
  • తర్వాత ఆ వివరాలతో లాగిన్​ అయ్యి అప్లికేషన్​ ఫామ్​ ఫిల్ చేసి ఫీజు పేమెంట్​ చేసి అన్ని వివరాలు సరిచూసుకున్న తర్వాత సబ్మిట్​ చేస్తే మీ అప్లికేషన్​ సక్సెస్​ అవుతుంది.

JEE అడ్వాన్స్​డ్ 2024 రిజిస్ట్రేషన్ స్టార్ట్​ - ఈజీగా అప్లై చేసుకోండిలా! - చివరి తేదీ ఎప్పుడంటే? - JEE Advanced 2024 Registration

అసిస్టెంట్ ప్రొఫెసర్​ కావాలా? యూజీసీ-నెట్​ 2024కు అప్లై చేసుకోండిలా! - UGC NET 2024

కేంద్రప్రభుత్వ ఉద్యోగం కావాలా? - CMSS నోటిఫికేషన్ రిలీజ్ - నెలకు రూ.లక్ష జీతం - పోస్టులు, అర్హతలిలా! - CMSS Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.