ETV Bharat / education-and-career

JEE అడ్వాన్స్​డ్ 2024 రిజిస్ట్రేషన్ స్టార్ట్​ - ఈజీగా అప్లై చేసుకోండిలా! - చివరి తేదీ ఎప్పుడంటే? - JEE Advanced 2024 Registration

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 5:13 PM IST

JEE Advanced 2024
JEE Advanced Registration 2024

JEE Advanced Registration 2024 : జేఈఈ (మెయిన్​) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ముఖ్య గమనిక. ఈ రోజు నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 2024కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. కాబట్టి, అర్హత గల అభ్యర్థులు ఈజీగా ఇప్పుడే ఆన్​లైన్​లో అప్లై చేసుకోండిలా!

JEE Advanced 2024 Registration : దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ(IITs)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష (JEE Advanced Exam)కు నేటి(ఏప్రిల్ 27) నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్(JEE Mains) ఫలితాల్లో అర్హత సాధించిన విద్యార్థులు ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అడ్వాన్స్​డ్ కోసం అప్లై చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం.. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 7 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అయితే, జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, అప్లికేషన్ ఫీజు, ఎలా అప్లై చేసుకోవాలి, పరీక్ష ఎప్పుడు, ఫలితాల విడుదల తేదీ వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్షకు అర్హతలు :

  • జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష 2024కు అప్లై చేసుకోవడానికి జేఈఈ (మెయిన్) 2024 బీఈ/బీటెక్ పేపర్​లో టాప్ 2,50,000 మంది (అన్ని కేటగిరీలతో సహా) అభ్యర్థుల్లో ఒకరుగా ఉండాలి.
  • అదేవిధంగా అడ్వాన్స్​డ్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు అక్టోబర్ 1, 1999 తర్వాత జన్మించి ఉండాలి. అయితే.. SC, ST, దివ్యాంగులకు ఐదు సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే.. వీరు 1994 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు : మహిళా అభ్యర్థులు, SC, ST, దివ్యాంగులు రిజిస్ట్రేషన్​ ఫీజు రూ. 1600 చెల్లించాలి. అదే ఇతర అభ్యర్థులు అందరూ రూ. 3200 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ విధానం(How to apply for JEE Advanced 2024) :

  • ముందుగా అభ్యర్థులు jeeadv.ac.in జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి.
  • ఆ తర్వాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న 'జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024' అనే రిజిస్ట్రేషన్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్పుడు రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి 'Submit' బటన్​పై నొక్కాలి.
  • అనంతరం అకౌంట్​లోకి లాగిన్ అయి.. అప్లికేషన్ ఫామ్​లో వివరాలన్ని సరిగ్గా ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించి 'Submit ​పై క్లిక్ చేయాలి.
  • ఆపై తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ డౌన్​లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకొని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోవాలి.
  • అయితే.. అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తమకు నచ్చిన ఎనిమిది పరీక్ష నగరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఇండియాలోని అత్యంత కఠినమైన పరీక్షలు​ ఇవే! పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా?

జేఈఈ అడ్వాన్స్​డ్ పరీక్ష ఎప్పుడంటే ? కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షను మే 26న నిర్వహించనున్నట్లు ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. పేపర్‌ -1 ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పేపర్‌ -2 మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహించనున్నారు. 40% వైకల్యం ఉన్న PWD అభ్యర్థులకు మరో గంట అదనపు సమయం ఇవ్వనున్నారు.

జేఈఈ అడ్వాన్స్​ 2024 మరికొన్ని వివరాలు : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్​కు చివరి తేదీ మే 7 కాగా.. దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. మే 17 నుంచి అడ్మిట్‌ కార్డులు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ఇక ప్రాథమిక కీ జూన్‌ 2న విడుదల చేసి.. తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.