ETV Bharat / education-and-career

ఇండియాలోని అత్యంత కఠినమైన పరీక్షలు​ ఇవే! పాస్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? - TOP 9 Toughest exams in India

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 1, 2024, 11:50 AM IST

Toughest Exams In India : దేశంలో విద్యార్థులు, నిరుద్యోగులు కోట్ల మంది ఉన్నారు. వీరు ఏటా అకడమిక్​ ఎంట్రన్స్ టెస్ట్​లు, క్వాలిఫయింగ్​ టెస్ట్​లు, రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్స్​ రాస్తూనే ఉంటారు. అయితే వీటన్నింటిలో అత్యంత కఠినమైన పరీక్షలు ఏమిటి? ఏటా ఈ పరీక్షలకు ఎంత మంది హాజరవుతుంటారు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

top 10 Toughest exams in India
Toughest entrance exams in India

Toughest Exams In India : ఇండియాలో విద్యార్థులకు, నిరుద్యోగులకు కొదవ లేదు. వీరు నిత్యం ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్​, రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్స్​ రాస్తూనే ఉంటారు. అయితే వీటిలో అత్యంత కఠినమైన పరీక్షలు ఏమిటి? ఏటా ఈ టఫెస్ట్ ఎగ్జామ్స్​ ఎంత మంది రాస్తుంటారు? అనేది ఇప్పుడు చూద్దాం.

1. UPSC CSE (సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్​)
యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్​ పరీక్షలు అత్యంత కఠినమైనవి. ఈ అత్యున్నమైన ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ కాంపిటీషన్ ఉంటుంది. ఏటా సుమారుగా 10 లక్షల మంది ఈ పరీక్షలు రాస్తుంటారు. అయితే వీరిలో కేవలం 0.1 శాతం నుంచి 0.3 శాతం అభ్యర్థులు​ మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక అవుతారు. అందుకే దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్​ ఎగ్జామ్స్​ ఒకటిగా నిలిచాయి.

2. IIT - JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్​​)
భారతదేశంలో ఇంజినీరింగ్ విద్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs) సహా, ప్రీమియర్​ ఇంజినీరింగ్ కాలేజ్​ల్లో సీట్​ సంపాదించేందుకు, అభ్యర్థులు అందరూ ఈ 'ఐఐటీ-జేఈఈ' (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్​) రాస్తుంటారు. ఏటా సుమారుగా 6 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, కేవలం 25 శాతం నుంచి 30 శాతం మంది మాత్రమే సెలక్ట్ అవుతుంటారు. అత్యంత కఠినమైన సెలక్షన్ ప్రాసెస్​ ఇది.

3. CAT (కామన్​ అడ్మిషన్​ టెస్ట్)
భారతదేశంలో పోస్ట్​ గ్రాడ్యుయేట్ మేనేజ్​మెంట్​ ప్రోగ్రామ్​ అడ్మిషన్​ కోసం 'కామన్​ అడ్మిషన్ టెస్ట్​' (సీఏటీ) రాయాల్సి ఉంటుంది. ఇది చాలా కఠినమైన పరీక్ష. ఏటా సుమారుగా 2.30 లక్షల మంది ఈ పరీక్ష రాస్తే, వారిలో కేవలం 2 శాతం అభ్యర్థులు మాత్రమే సెలక్ట్ అవుతుంటారు.

4. CLAT (కామన్​ లా అడ్మిషన్ టెస్ట్​)
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన లా యూనివర్సిటీల్లో సీట్ సంపాదించాలంటే, 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్' రాయాల్సి ఉంటుంది. న్యాయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు చాలా పరిమితంగా ఉంటాయి. పైగా సెలక్షన్ ప్రాసెస్​ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఏటా సుమారుగా 60 వేల మంది ఈ 'కామన్ లా అడ్మిషన్ టెస్ట్' (CLAT) రాస్తే, వారిలో కేవలం 3 శాతం అభ్యర్థులు మాత్రమే ఎంపిక అవుతుంటారు.

5. CA (ఛార్టర్డ్​ అకౌంటెంట్​)
దేశంలోని అత్యంత కఠినమైన కోర్సుల్లో సీఏ (ఛార్టర్డ్ అకౌంటెంట్​) ఒకటి. 'ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఛార్టర్డ్​ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా' (ICAI) ఏటా ఈ సీఏ పరీక్ష నిర్వహిస్తూ ఉంటుంది. ఈ పరీక్ష చాలా హైస్టాండర్డ్స్​లో ఉంటుంది. ఏటా సుమారుగా 95 వేల మంది అభ్యర్థులు ఈ పరీక్ష రాస్తుంటారు. కానీ వీరిలో కేవలం 25 శాతం మంది మాత్రమే సెలక్ట్​ అవుతుంటారు.

6. NEET (నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్​)
వైద్య వృత్తిపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ 'నీట్' ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా అండర్​ గ్రాడ్యుయేట్​ మెడికల్, డెంటల్ కోర్సులు చేయాలని అనుకునేవారు ఈ 'నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్' రాయాల్సి ఉంటుంది. ఏటా దాదాపు 18 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు. కానీ వీరిలో కేవలం 7 శాతం మంది మాత్రమే ఎంపిక అవుతారు. అంటే ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

7. GATE (గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్​ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)
ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs), ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ సైన్స్​ (IISC)లు కలిసి సంయుక్తంగా 'గేట్​' ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉంటాయి. ఇంజినీరింగ్ అండ్​ టెక్నాలజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఆశించే అభ్యర్థులు అందరూ ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఏటా దాదాపు 7 లక్షల మంది ఈ గేట్ ఎగ్జామ్ రాస్తే, కేవలం 17 శాతం మంది మాత్రమే క్వాలిఫై అవుతుంటారు.

8. NDA (నేషనల్ డిఫెన్స్ అకాడమీ)
దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) ఎగ్జామ్ ఒకటి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఎన్​డీఏ పరీక్షను నిర్వహిస్తూ ఉంటుంది. ఏటా దాదాపు 3 లక్షల మంది ఈ పరీక్ష రాస్తారు. కానీ వీరిలో కేవలం 0.1 శాతం మంది మాత్రమే క్వాలిఫై అవుతుంటారు. ఇలా క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకమైన ఎన్​డీఏ, నేవల్ అకాడమీల్లో అడ్మిషన్ పొందుతారు.

9. UGC NET (యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్​)
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తరపున నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) ఏటా రెండు సార్లు 'నేషనల్​ ఎలిజిబిలిటీ టెస్ట్' నిర్వహిస్తోంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్​ (జేఆర్​ఎఫ్​) పొందడానికి, అసిస్టెంట్ ప్రొఫెషర్ పోస్టులకు ఎలిజిబిలిటీ సంపాదించడానికి ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన పరీక్ష. ఏటా సుమారుగా 5 లక్షల మంది ఈ యూజీఎస్ నెట్​ రాస్తుంటే, కేవలం 9 శాతం మంది మాత్రమే క్వాలిఫై అవుతున్నారు.

సమయం విలువ తెలిస్తేనే బెస్ట్ పొజిషన్​కు!- టైమ్ మేనేజ్​మెంట్ స్కిల్స్ మీలో ఉన్నాయా? - Time Management Skills In Telugu

టీసీఎస్ ఫ్రెషర్స్ హైరింగ్ షురూ - అప్లైకు మరో 11 రోజులే ఛాన్స్​ - వారికి స్పెషల్ ఏఐ ట్రైనింగ్​ కూడా! - TCS Hiring 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.