ETV Bharat / education-and-career

మాక్ ఇంటర్వ్యూలకు ఎటెండ్​ కావాలా? ఈ టాప్​-4 ఫ్రీ వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 10:57 AM IST

Mock Interview Websites : మీకు ఇంటర్వ్యూ అంటే భయమా? అయితే ఇది మీ కోసమే. గూగుల్​లో సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా పనిచేస్తున్న దీక్షా పాండే నాలుగు 'ఫ్రీ మాక్​ ఇంటర్వ్యూ వెబ్​సైట్స్'ను సూచిస్తున్నారు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Mock interview websites
Free Sites for Mock Interviews

Mock Interview Websites : మీరు సాఫ్ట్​వేర్ ఇంజినీర్​గా కెరీర్​ ప్రారంభిద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది ఇంటర్వ్యూ పేరు చెప్పగానే చాలా నెర్వస్​గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు తమకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్​, స్కిల్స్ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో తడబడి మంచి ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకే ఇలాంటి వారు మాక్ ఇంటర్వ్యూలకు వెళ్లడం చాలా మంచిది. అయితే కొంత మందికి డబ్బులు కట్టి, మాక్ ఇంటర్వ్యూలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు చింతించాల్సిన పనేమీ లేదు. నేడు ఆన్​లైన్​లో చాలా మాక్​ ఇంటర్వ్యూ వెబ్​సైట్​లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే ఈ ఆర్టికల్​లో గూగుల్ కంపెనీలో సాఫ్ట్​వేర్ ఇంజనీర్​గా పనిచేస్తున్న దీక్షా పాండే సూచించిన కొన్ని ముఖ్యమైన 'ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ వెబ్​సైట్స్​' గురించి తెలుసుకుందాం.

PRAMP.COM :
సాఫ్ట్​వేర్ ఇంజనీర్లు ఈ PRAMP.COM అనే ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ ప్లాట్​ఫామ్​ను ఉపయోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించి టెక్నికల్ రౌండ్​ ఇంటర్వ్యూను ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్​ ప్రిఫరెన్స్, ప్రాక్టీస్​ అవసరాల మేరకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ వెబ్​సైట్​లో కోడ్ ఎడిటర్ ద్వారా లైవ్​లో వన్​-టు-వన్​ ఇంటర్వ్యూ సెషన్లు నిర్వహిస్తారు.

INTERVIEWING.IO :
సాఫ్ట్​వేర్ ఇంజినీర్లకు INTERVIEWING.IO ప్లాట్​ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సైట్లో నిజమైన వ్యక్తులతో ఫ్రీ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే ఈ వెబ్​సైట్​లో మీతోటి వ్యక్తులతో కలిసి ప్రాక్టీస్​ సెషన్లు పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ వెబ్​సైట్​లో పెయిడ్​ మెంబర్​గా కూడా చేరవచ్చు. దీని వల్ల గూగుల్, ఫేస్​బుక్​ లాంటి పెద్దపెద్ద సంస్థల్లో సీనియర్ ఇంజినీర్లుగా ఉన్నవారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్లు మీకు ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో చెబుతారు. మీరు ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కొన్నారు? ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి? అనే సూచనలు కూడా ఇస్తారు. కనుక చక్కగా ప్రాక్టీస్​ చేస్తే, మంచి జాబ్​ సాధించే అవకాశం పెరుగుతుంది.

PREPBUNK.COM :
ఈ వెబ్​సైట్​లో మీరు రిజిస్టర్ చేసుకుంటే, నిజమైన వ్యక్తులు ఫోన్​ లేదా స్కైప్ ద్వారా మిమ్మల్ని మాక్ ఇంటర్వ్యూ చేస్తారు. దశలవారీ విధానంలో, సమగ్రంగా మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునేందుకు సహకరిస్తారు. అంతేకాదు ఈ వెబ్​సైట్​లో ఇంటర్వ్యూలను సక్సెస్​ఫుల్​గా ఎదుర్కొనేందుకు కావాల్సిన మూడు వారాల కోర్స్​ కూడా అందుబాటులో ఉంటుంది.

INTERVIEWBIT.COM :
సాఫ్ట్​వేర్ ఇంజనీర్లకు చాలా సుపరిచితమైన ప్లాట్​ఫామ్ INTERVIEWBIT.COM. దీనిలో చాలా మంది అనుభవజ్ఞులైన నిపుణులు ఉంటారు. వీరి సాయంతో ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్చుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వెబ్​సైట్​ మంచి స్కిల్స్ ఉన్నవారిని కార్పొరేట్ కంపెనీలకు, స్టార్టప్​లకు పరిచయం చేస్తుంది. కనుక మంచి జాబ్​ సంపాదించే అవకాశం మీకు కలుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మీకు నచ్చిన మాక్​ ఇంటర్వ్యూ వెబ్​సైట్​లో రిజిస్టర్ చేసుకోండి. మీలోని భయాలను పోగొట్టుకుని, మీకు నచ్చిన జాబ్​ను సంపాదించేయండి. ఆల్​ ది బెస్ట్!

ఫ్రీలాన్సర్​గా పని చేయాలా? ఈ టాప్​-10 వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

పార్ట్ టైమ్ జాబ్​ చేయాలా? ఈ టాప్​-10 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.