ETV Bharat / business

శనివారం BSEలో స్పెషల్​ మాక్ ట్రేడింగ్​ - షెడ్యూల్​ & టైమింగ్స్​ వివరాలు ఇవే! - Stock market open on April 6

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 10:19 AM IST

Stock market open on Saturday April 6 for mock trading
BSE

Stock Market Open On Saturday April 6 For Mock Trading : బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్​ఈ) ఏప్రిల్ 6న మాక్​ ట్రేడింగ్ సెషన్​ను నిర్వహిస్తోంది. అయితే ఇది కేవలం కొత్త సాఫ్​వేర్ టెస్టింగ్ కోసం మాత్రమే చేస్తున్నట్లు స్పష్టం చేసింది. దీని షెడ్యూల్​, టైమింగ్ వివరాలు మీ కోసం.

Stock Market Open On Saturday April 6 For Mock Trading : ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్​ బీఎస్​ఈ ఈ శనివారం (ఏప్రిల్​ 6) నాడు ప్రత్యేకంగా మాక్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తోంది. ఇందులో ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్​, గోల్డ్​ రిసిప్ట్స్​, కరెన్సీ, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్స్​కు సంబంధించిన మాక్ ట్రేడింగ్ జరుగుతుంది.

టెస్టింగ్ కోసం మాత్రమే!
ట్రేడింగ్​, రిస్క్ మేనేజ్​మెంట్​ల కోసం కొత్త సాఫ్ట్​వేర్​ను తీసుకువచ్చారు. దీనిని పరీక్షించేందుకు, బీఎస్​ఈ ప్రత్యేకంగా ఈ ట్రేడింగ్​ సెషన్​ను నిర్వహిస్తోంది. కనుక ఆసక్తి ఉన్న సభ్యులు ఈ మాక్ ట్రేడింగ్ సెషన్​​లో పాల్గొనవచ్చు.

ఇక్కడ ఇన్వెస్టర్లు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ మాక్ ట్రేడింగ్​లో చేసే ట్రేడ్​లకు లాంటి మార్జిన్ ఆబ్లిగేషన్​లు ఉండవు. అంటే పే-ఇన్​, పే-అవుట్​ ఆబ్లిగేషన్​లు ఉండవు. అలాగే మదుపరులకు ఎలాంటి హక్కులు, లయబిలిటీస్​ వర్తించవు.

బీఎస్​ఈ ఈక్విటీ మాక్ ట్రేడింగ్ సెషన్ టైమింగ్స్ :

  • లాగిన్ సమయం - ఉదయం 10:15 నుంచి 10:45 వరకు
  • మార్నింగ్ బ్లాక్ డీల్ విండో - ఉదయం 10:45 నుంచి 11:00 వరకు ఉంటుంది
  • ప్రీ-ఓపెన్ - ఉదయం 11:00 నుంచి11:15 వరకు
  • కంటిన్యుయెస్​ ట్రేడింగ్ T+1 - 11:15 am నుంచి 3:30 pm వరకు
  • కంటిన్యుయెస్​ ట్రేడింగ్ T+0 - 11:15 am నుంచి 1:30 pm వరకు
  • IPO & రీ-లిస్టెడ్​ స్క్రిప్‌ల కోసం స్పెషల్​ ప్రీ-ఓపెన్​ - ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు
  • SPOS స్క్రిప్‌ల కోసం కంటిన్యుయెస్​ ట్రేడింగ్ - 12:00 నుంచి 3:30 వరకు
  • పీరియాడిక్​ కాల్ ఆక్షన్​ (1 గంట చొప్పున 4 సెషన్లు) - ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు
  • సెటిల్మెంట్ కోసం ఆక్షన్ - మధ్యాహ్నం 12:00 నుంచి 12:45 వరకు
  • ఆఫ్టర్​నూన్​ బ్లాక్ డీల్ విండో - మధ్యాహ్నం 12:50 నుంచి 13:05 వరకు
  • క్లోజింగ్​ - మధ్యాహ్నం 3:30 నుంచి 3:40 వరకు
  • పోస్ట్-క్లోజింగ్​ - మధ్యాహ్నం 3:40 నుంచి 3:50 వరకు

బీఎస్​ఈ ఈక్విటీ డెరివేటివ్స్ మాక్ ట్రేడింగ్ సెషన్ టైమింగ్స్

  • లాగిన్​ - ఉదయం 10:15 నుంచి 11:15 వరకు
  • కంటిన్యుయెస్ ట్రేడింగ్ - ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు

BSE కరెన్సీ డెరివేటివ్స్ మాక్ ట్రేడింగ్ సెషన్ టైమింగ్స్

  • లాగిన్ - ఉదయం 10:15 నుంచి 11:00 వరకు
  • కరెన్సీ డెరివేటివ్‌ల కోసం కంటిన్యుయెస్​ ట్రేడింగ్ - ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు
  • క్రాస్ కరెన్సీ డెరివేటివ్స్ కోసం కంటిన్యుయెస్​ ట్రేడింగ్ - ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు
  • ట్రేడ్ మోడిఫికేషన్​ (కరెన్సీ) - మధ్యాహ్నం 3:40
  • ట్రేడ్ మోడిఫికేషన్​ (క్రాస్ కరెన్సీ) - మధ్యాహ్నం 3:40

అన్నింటికీ సిద్ధంగా!
2024 క్యాలెండర్ ఇయర్​లో బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు శనివారం రోజున ట్రేడింగ్ సెషన్ నిర్వహించడం ఇది రెండోసారి. ప్రస్తుతం జరుగుతున్నది కేవలం మాక్ ట్రేడింగ్ మాత్రమే. గతంలో (మార్చి 2న) చేసినది మాత్రం లైవ్ ట్రేడింగ్​. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా, ట్రేడింగ్​కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఆ లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు.

రూ.73వేలు దాటిన బంగారం - రూ.83వేలకు చేరువలో వెండి! - Gold Rate Today April 6th 2024

హోమ్​ లోన్ సకాలంలో చెల్లించలేకపోతున్నారా? ఇలా చేస్తే ఏ ఇబ్బందీ రాదు! - timely Home Loan EMI Repayments

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.