ETV Bharat / business

కారు లోన్​పై టాపప్​ కావాలా? అయితే ఈ విషయాలు కచ్చితంగా గుర్తుంచుకోండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 8:26 PM IST

How To Get Top Up On Car Loan : మీకు ఇప్పటికే కారు లోన్ ఉందా? అత్యవసరంగా డబ్బు అవసరం ఏర్పడిందా? కారు లోన్​పై టాపప్​ తీసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఏవిధంగా చేస్తే టాపప్​ లోన్ పొందవచ్చు? అనే విషయాన్ని ఇప్పడు చూద్దాం.

car top up loan interest rate
How To Get Top Up On Car Loan

How To Get Top Up On Car Loan : ఎవైనా అనుకోని ఆర్థిక పరిస్థితులు ఎదురైనప్పుడు కొత్తగా లోన్​కు అప్లై చేసి, వేచి చూడాల్సిన అవసరం లేకుండా కారు లోన్​పై టాపప్‌ సహాయపడుతుంది. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్నవారికి బ్యాంకులు సులభంగానే ఈ రుణాలను ఇస్తాయి. ఈ టాపప్​ లోన్​లను మీ వ్యక్తిగత అవసరాలకూ వాడుకోవచ్చు. లేదా కారు మరమ్మతు కోసమూ ఉపయోగించుకోవచ్చు.

కారు లోన్​ టాపప్ విషయంలో ముఖ్యమైన అంశాలు ఇవే

  1. కారు లోన్​ టాపప్‌ దరఖాస్తును బ్యాంకులు చాలా వేగంగా ఆమోదిస్తాయి.
  2. లోన్ అప్లికేషన్ ఆమోదం పొందిన వెంటనే అకౌంట్​లో డబ్బును జమ చేస్తాయి.
  3. సాధారణంగా ఎలాంటి అదనపు డాక్యుమెంట్లు అవసరం లేకుండా బ్యాంకులు టాపప్‌ లోన్​లను అందించే అవకాశం ఉంది. కొన్నిసార్లు అదనంగా డాక్యుమెంట్లు కావాలని చెప్పొచ్చు.
  4. టాపప్‌ లోన్​ను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునేందుకు వీలుంటుంది. బ్యాంకు శాఖకు వెళ్లి అప్లై చేయాల్సిన పనిలేదు. ఇప్పటికే లోన్​ తీసుకున్న బ్యాంకు వెబ్‌సైటు లేదా యాప్‌ నుంచి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  5. ఈ టాపప్‌ లోన్​కు వాహన రుణానికీ సాధారణ వాహన రుణానికి ఉండే వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొన్నిసార్లు అరశాతం ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది.
  6. ఇప్పటికే వాహన లోన్​ను ఇచ్చిన బ్యాంకు దగ్గర మన కారు హామీగా ఉంటుంది. కనుక, టాపప్‌ లోన్​ కోసం ప్రత్యేకంగా తనఖా అవసరం ఉండదు.
  7. టాపప్‌ లోన్​ పొందడం సులభమే అయినా బ్యాంకు లేదా రుణాన్ని మంజూరుచేసే ఆర్థిక సంస్థ నిబంధనలను గమనించాలి. కొన్ని బ్యాంకులు పర్సనల్​ లోన్​గా పేర్కొంటూ13-14 శాతం వరకూ వడ్డీని విధిస్తాయని గుర్తుంచుకోండి.

కారు లోన్​ - గుర్తించుకోవాల్సిన అంశాలు ఇవే!
వాహన రుణాన్ని తీసుకోవాలనుకునే ముందు ఏయే విషయాలు పరిగణలోకి తీసుకోవాలి? ఏవిధంగా చేస్తే లోన్​ను వేగంగా పొందవచ్చు. కారు లోన్​ తీసుకునేందుకు ఆర్థిక ప్రణాళిక ఏవిధంగా ఉంటే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం

సిబిల్​ స్కోరు
లోన్​ కోసం అప్లై చేసే సమయంలో బ్యాంకులు ముందుగా రుణ గ్రహీత సిబిల్ ​స్కోరును (క్రెడిట్​స్కోరు) విశ్లేషిస్తాయి. తక్కువ క్రెడిట్‌ స్కోరున్న వారికి రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావు. ముఖ్యంగా వెహికల్​ లోన్​ల విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉంటాయి. కనుక, కారు కొనాలని అనుకున్న వెంటనే సిబిల్​ స్కోరును గమనించాలి. అందులో ఏమైనా వ్యత్యాసాలను మీరు గమనించినట్లయితే వెంటనే సంబంధిత బ్యాంకు, క్రెడిట్​బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. స్కోరు 750కి మించి ఉన్నప్పడే అనుకున్న లోన్​ అందుకునేందుకు వీలవుతుంది. వివిధ బ్యాంకుల వడ్డీరేట్లను పోల్చిచూడండి

ముందుగా వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలను, వాటి వడ్డీ రేట్లను సరిపోల్చుకోండి. బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్ల ద్వారా, ఈ వివరాలు సులభంగానే తెలుసుకోవచ్చు. కారు లోన్​ సాధారణంగా ఏడేళ్లపాటు ఉంటుంది. కనుక, రుణదాత విషయంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. వాయిదా గడువు తేదీ దాటితే విధించే జరిమానాలతో పాటు, అన్ని రుసుముల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత వరకూ లోన్​ ఇస్తున్నారో చూసుకోండి. కొన్ని బ్యాంకులు ఆన్‌రోడ్‌ ప్రైస్​పై 100 శాతం రుణాలు ఇస్తున్నాయి. మీ అర్హతకు అనుగుణంగా, ఇలాంటివీ చూడొచ్చు. వీలైనంత వరకూ తక్కువ లోన్​ తీసుకోవడమే ఎల్లప్పుడూ మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. పూర్తి స్టోరీని చదివేందుకు ఈ లింక్​పై క్లిక్ చేయండి.

కార్​ లోన్ కావాలా?.. ఈ టిప్స్​ పాటిస్తే తక్కువ వడ్డీతో.. లోన్ గ్యారెంటీ!

Car Loan Tips : కారు 'లోన్​' తీసుకోవాలా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లమ్​ లేకుండా..​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.