ETV Bharat / business

Car Loan Tips : కారు 'లోన్​' తీసుకోవాలా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ప్రాబ్లమ్​ లేకుండా..​!

author img

By

Published : Jul 16, 2023, 10:46 AM IST

Car Loan Tips : కొత్త కారు కొనేందుకు ఇప్పటి కాలంలో చాలామంది బ్యాంకుల నుంచి రుణాలను తీసుకుంటున్నారు. అయితే ఈ కారు లోన్ తీసుకునే సమయంలో కొన్ని విషయాలు గురించి తెలియక వినియోగదారులు ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొత్తగా లోన్​ తీసుకోనున్న వారి పలు జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే?

car loan precautions
car loan tips

New Car Loan Tips : ఆర్ధిక పరిస్ధితుల దృష్ట్యా చాలా మంది బ్యాంకుల నుంచి వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మనం ఏ విషయం కోసం లోన్​ తీసుకుంటున్నామన్న దాన్ని బట్టి ఆయా రుణాలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తాయి. ఆ మొత్తాన్ని ఈఎంఐ రూపంలో చెల్లించుకునే అవకాశాన్ని కూడా బ్యాంకులు ఖాతాదారులకు కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో చాలామంది వ్యాపారులు, ఉద్యోగులు ఎక్కువగా రుణాలు తీసుకుంటూ నెలనెలా ఈఎంఐల రూపంలో ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

అయితే రుణాల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. పర్సనల్​ లోన్​, బిజినెస్​ లోన్​, వెహికల్​ లోన్​, హోమ్​ లోన్​, మ్యారేజ్ లోన్ లాంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగులు ఎక్కువగా పర్సనల్ లోన్‌తో పాటు కారు లోన్ తీసుకుంటూ కనిపిస్తుంటారు. ఈ క్రమంలో కొత్తగా కారు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల నుంచి లోన్​ తీసుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కారు లోన్ వల్ల ప్రయోజనాలేంటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సులభ రుణ మంజూరు ప్రక్రియ
బ్యాంకులు కారు లోన్‌ను సులువుగా మంజూరు చేస్తాయి. ముందస్తుగా పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండానే మనం కారును కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. తద్వారా మన వద్ద అవసరమైన మొత్తం లేకపోయినా.. బ్యాంకు నుంచి రుణం పొంది ఆ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు.

సకాలంలో చెల్లింపులు
కారు లోన్ తీసుకున్నప్పుడు సకాలంలో ఈఎంఐ చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది. గడువు తేదీలోగా రుణం చెల్లించడం వల్ల భవిష్యత్తులో వేరే రుణం తీసుకోవాలనుకున్నప్పుడు మనకున్న మంచి సిబిల్​ స్కోర్​ కొత్త లోన్​ తీసుకునేందుకు ఉపయోగపడుతుంది.

ఈఎంఐ సదుపాయం
ఇక కారు లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు అనేక సౌలభ్యాలను కల్పిస్తాయి. తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా నెలకు ఎంత చెల్లించాలనేది విషయాన్ని రుణ గ్రహీత నిర్ణయించుకోవచ్చు. అలాగే ఎన్ని సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలనేది కూడా ఖాతాదారులు స్వయాన ఎంచుకోవచ్చు. దీని వల్ల ఆర్ధిక వ్యవహారాలను మరింత సమర్ధవంతంగా నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.

లోన్ చెల్లించిన తర్వాత యాజమాన్య హక్కులు
కారు రుణం తీసుకుని పూర్తిస్థాయిలో చెల్లించిన తర్వాత మీకు పూర్తి యాజమాన్య హక్కులు మంజూరు చేస్తారు. దీంతో మీరు కారుకు మీకు నచ్చినట్లుగా మార్పులు చేసుకోవచ్చు.

వడ్డీ భారం
కారు కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నప్పుడు వడ్డీతో సహా మొత్తం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వడ్డీతో కలిపి కారు ధర కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో రుణ భారం పడకుండా ముందుగానే కారు ధర, వడ్డీ రేట్లను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలి. మన ఆదాయ వనరులు, ఆర్థిక స్తోమతను బట్టి కారు లోన్ తీసుకోవాలి. మీ అవసరాల కోసమయ్యే ఖర్చులు అన్నీ లెక్క వేసుకున్న తర్వాత కారు లోన్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం
కారు లోన్ చెల్లింపులు ఒక వ్యక్తి నెలవారీ బడ్జెట్‌పై ప్రభావం చూపుతాయి. ఈఎంఐ పోను మీ అవసరాలకు డబ్బులు సరిపోయేలా ప్లాన్ చేసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.