ETV Bharat / business

మీ TDS​​ అమౌంట్​ను చెక్​ చేసుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 8:07 PM IST

How To Check TDS Amount Using Net Banking
How To Check TDS Amount Online

How To Check TDS Amount Online : మీరు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేశారా? మీ టీడీఎస్​ రీఫండ్​ను చెక్​ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఆన్​లైన్​లో చాలా సులువుగా టీడీఎస్ అమౌంట్​ను ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

How To Check TDS Amount Online : పన్ను చెల్లింపుదారులు ఇప్పుడు ఆన్​లైన్​లోనే చాలా సులువుగా తమ ట్యాక్స్ క్రెడిట్స్​ను చెక్​ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆదాయపన్ను శాఖ నెట్​ బ్యాంకింగ్ పోర్టల్​ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పన్ను చెల్లింపుదారులు​ తమ టీడీఎస్​ (ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్​)ను చాలా సులువుగా చెక్​ చేసుకోవచ్చు. అయితే వారు ముందుగా తమ పాన్​ కార్డును పోర్టల్​తో లింక్ చేసుకోవాల్సి ఉంటుంది.

టీడీఎస్ అంటే ఏమిటి?

  • కంపెనీ ఒక వ్యక్తికి చేసిన చెల్లింపులపై విధించే పన్నునే టీడీఎస్ అంటారు.
  • జీతాలు, అద్దె చెల్లింపులు, బ్రోకరేజీ, కమీషన్​, ప్రొఫెషనల్ ఫీజు లాంటి చెల్లింపులు అన్నింటిపై ఈ టీడీఎస్​ వర్తిస్తుంది. అయితే ఈ టీడీఎస్ రేట్లు వ్యక్తుల వయస్సు, ఆదాయం ఆధారంగా నిర్ణయించబడతాయి.
  • వాస్తవానికి యజమాని - ఉద్యోగికి జీతం ఇచ్చినప్పుడే ఈ టీడీఎస్​ను కట్​ చేసి, ​దానిని ప్రభుత్వానికి చెల్లిస్తాడు.
  • దీని వల్ల ఉద్యోగులు పన్ను ఎగవేయడానికి వీలుపడదు.

సరే, ఇప్పుడు మనం పాన్ కార్డ్​ను ఉపయోగించి, ఆన్​లైన్​లో టీడీఎస్​ అమౌంట్​ను ఎలా చెక్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.

How To Check TDS Amount In Net Banking App Using PAN Card :

  • ముందుగా మీ ఆథరైజ్డ్​ నెట్ బ్యాంకింగ్ యాప్​ను ప్లేసోర్ట్​ లేదా యాప్​ స్టోర్​ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • సదరు నెట్​ బ్యాంకింగ్ యాప్​లో మీరు రిజిస్టర్ చేసుకోవాలి.
  • ఆ యాప్​లోనే మీ బ్యాంక్​ అకౌంట్​తో పాన్​ కార్డ్​ను లింక్ చేసుకోవాలి.
  • అప్పుడు మీరు మీ బ్యాంక్​ స్టేట్​మెంట్​ను సులువుగా చూడవచ్చు. దీనిలోనే డీటీఎస్ వివరాలు ఉంటాయి. లేదా
  • మీరు చెల్లించిన పన్ను వివరాల రికార్డును చూడవచ్చు. దీని ద్వారా కూడా టీడీఎస్​ రిటర్న్​లను చూడవచ్చు.

How To Check TDS Amount Online Using PAN Card :

  • ముందుగా మీరు అధికారిక https://www.tdscpc.gov.in/app/tapn/tdstcscredit.xhtml వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • వెబ్​సైట్​లో వెరిఫికేషన్ కోడ్​ను ఎంటర్ చేసి, ప్రొసీడ్​పై క్లిక్ చేయాలి.
  • వెబ్​సైట్​లో మీ పాన్ కార్డు నంబర్, TAN నంబర్ ఎంటర్ చేయాలి.
  • (నోట్​ : TAN అంటే టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్​)
  • మీకు కావాల్సిన ఫైనాన్సియల్ ఇయర్​, క్వార్టర్​, టైప్ ఆఫ్​ రిటర్న్​లను సెలెక్ట్ చేసుకొని Goపై క్లిక్ చేయాలి.
  • వెంటనే మీ టీడీఎస్​ అమౌంట్​కు సంబంధించిన వివరాలు స్క్రీన్​పై కనిపిస్తాయి.

మీరు కనుక పన్ను చెల్లింపుదారులు అయితే, కచ్చితంగా మీకు రావాల్సిన టీడీఎస్​ రీఫండ్​ను ట్రాక్ చేసుకోవాలి. అప్పుడే మీరు సరైన విధానంలో ఆర్థిక నిర్వహణ చేసుకోగలుగుతారు.

అత్యవసరంగా డబ్బు అవసరమా? లోన్ తీసుకునేందుకు ఉన్న బెస్ట్​ ఆప్షన్స్​ ఇవే!

40 ఏళ్లకే పెన్షన్​​ కావాలా? నెలకు రూ.12,500 ఇచ్చే బెస్ట్ పాలసీ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.