ETV Bharat / business

మళ్లీ పెరుగుతున్న బంగారం, వెండి ధరలు! - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 9:40 AM IST

Updated : Apr 24, 2024, 10:17 AM IST

Gold Price Today April 24, 2024
Gold Rate Today April 24, 2024

Gold Rate Today April 24, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today April 24, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.73,845 ఉండగా, బుధవారం నాటికి రూ.534 పెరిగి రూ.74,379కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.82,485 ఉండగా, బుధవారం నాటికి రూ.1,153 పెరిగి రూ.83,638కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad April 24, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.74,379గా ఉంది. కిలో వెండి ధర రూ.83,638గా ఉంది.
  • Gold Price In Vijayawada April 24, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,379గా ఉంది. కిలో వెండి ధర రూ.83,638గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam April 24, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,379గా ఉంది. కిలో వెండి ధర రూ.83,638గా ఉంది.
  • Gold Price In Proddatur April 24, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,379గా ఉంది. కిలో వెండి ధర రూ.83,638గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price April 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2,303 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 24 డాలర్లు పెరిగి 2,327 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 27.45 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News April 24, 2024 : బుధవారం కూడా క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.54,71,000
ఇథీరియంరూ.2,53,002
టెథర్రూ.79.52
బైనాన్స్ కాయిన్ రూ.47,966
సొలోనా రూ.12,900

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today April April 24, 2024 : బుధవారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల వరుసగా నాలుగో రోజు కూడా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 253 పాయింట్లు లాభపడి 74,002 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 68 పాయింట్లు వృద్ధి చెంది 22,436 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా స్టీల్​, నెస్లే ఇండియా, టాటా మోటార్స్​, హెచ్​సీఎల్ టెక్​, యాక్సిస్ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, విప్రో, ఎస్​బీఐ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, హిందూస్థాన్ యూనిలివర్​, టైటాన్​, ఐసీఐసీఐ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open March April 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.29గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices April 24, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices April 24, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.02 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 88.44 డాలర్లుగా ఉంది.

మీ ఇన్సూరెన్స్​​ పాలసీని 'e-Policy'గా మార్చాలా? ఈ సింపుల్​ స్టెప్స్​ ఫాలో అవ్వండి! - E Insurance Policy

PPF అకౌంట్​ మెచ్యూర్​ అయ్యిందా? ఈ టిప్స్​ పాటిస్తే - మీ ఆదాయం 'డబుల్'​​ కావడం గ్యారెంటీ! - PPF Corpus Management Tips

Last Updated :Apr 24, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.