ETV Bharat / business

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 6 హక్కుల గురించి తెలుసుకోవడం మస్ట్! - Employee Basic Rights

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 1:26 PM IST

Employee Basic Rights : మీరు కొత్తగా ఉద్యోగంలో చేరారా? అయితే కచ్చితంగా మీ హక్కులు గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగ ఒప్పందం, జీతం, పని గంటలు, నోటీస్ పీరియడ్, సెలవులు, కంపెనీ నియమ, నిబంధనలు, షరతులు ఇలా అన్ని వివరాలను మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే తర్వాత ఇబ్బందులు పడతారు. అందుకే ఈ ఆర్టికల్​లో ఉద్యోగులందరూ తప్పక తెలుసుకోవాల్సిన 6 కీలకమైన హక్కులు ఏమిటో చూద్దాం.

Basic Rights Every Employee Must Know
Employee Basic Rights (ETV Bharat)

Employee Basic Rights : కొత్తగా ఉద్యోగంలో చేరినవారు చాలా ఉత్సాహంతో ఉంటారు. పనిలో తమ సామర్థ్యాలను నిరూపించుకోవాలని కుతూహలంతో ఉంటారు. వాస్తవానికి ఉద్యోగ జీవితంలో బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఉద్యోగుల హక్కులను చాలా సార్లు కంపెనీలు పట్టించుకోవు. అందుకే ఉద్యోగులు అందరూ కచ్చితంగా తమకు ఉన్న కీలకమైన హక్కుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

కంపెనీలు ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునే ముందు, కచ్చితంగా ఒక ఒప్పందాన్ని చేసుకుంటాయి. దీనిలో ఉద్యోగ నియమాలు, షరతులు అన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగికి ఇచ్చే జీతభత్యాలు, పని గంటలు, నోటీస్​ వ్యవధి, వార్షిక సెలవులు, ప్రోత్సాహకాలు, ఉద్యోగం నుంచి తొలగించే కారణాలు ఇలా అన్ని వివరాలు ఈ ఒప్పందంలో ఉంటాయి. వీటిని అనుసరించి ఉద్యోగులు తమ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో యజమానులు కూడా ఉద్యోగుల పట్ల అనేక బాధ్యతలను కలిగి ఉంటారు. వాటిని సరిగ్గా పాటించకపోతే, ఉద్యోగులు న్యాయపోరాటానికి దిగొచ్చు. అందుకే ఉద్యోగ ఒప్పందంపై సంతకం చేసే ముందు, అందులో ఉన్న నియమ నిబంధనలన్నీ సరైన విధంగా ఉన్నాయో? లేదో చెక్ చేసుకోవాలి. అలా చేయాలంటే, ముందుగా ఉద్యోగులకు ఉండే ప్రాథమిక ఉపాధి హక్కులపై ఓ అవగాహన ఉండాలి. అందుకే ఉద్యోగులకు ఉండే 6 ప్రధానమైన హక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉద్యోగం వదిలేసే హక్కు
ఏ ఉద్యోగికైనా జాబ్ మానేసే హక్కు ఉంది. అయితే ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, నోటీస్ పీరియడ్​లో పని చేయాల్సి ఉంటుంది. అయితే ఉద్యోగిని తీసేసే ముందు కంపెనీ యజమాన్యం సహేతుకమైన నోటీసును ఇవ్వాలి. జాబ్ మానేసే ఆఖరి తేదీ వరకు ఉద్యోగికి ఇవ్వాల్సిన జీతం, ఇతర అలవెన్సులను యాజమాన్యం ఇవ్వాలి. అకారణంగా ఉద్యోగులను యాజమాన్యం తొలగిస్తే కోర్టులో దావా వేయవచ్చు. దీని వల్ల ఉద్యోగికి రావాల్సిన జీతం, అలవెన్సులు తిరిగి లభిస్తాయి. అంతేకాదు కేసు నడుస్తున్న సమయంలో ఉద్యోగి అనుభవించిన మానసిక క్షోభకు కూడా పరిహారం పొందవచ్చు.

వివక్షకు గురైతే ఫిర్యాదు చేయొచ్చు
వివక్ష, వేధింపులకు గురైతే సంబంధిత అధికారులకు ఉద్యోగి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే జీతాల బకాయిలు, ఇతర హక్కుల విషయంలోనూ యూనియన్ లీడర్స్​తో కలిసి యాజమాన్యంపై పోరాడవచ్చు.

వైద్య ఖర్చులు పొందవచ్చు!
పని వేళల్లో ఉద్యోగికి గాయమైతే వైద్య ఖర్చులు యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రెండు విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఉద్యోగి స్వయంకృతాపరాధం వల్ల గాయపడడం, పని వేళలో అనుకోకుండా గాయపడ్డారా అన్నది ముఖ్యం. పనివేళలో గాయాలైతే అవి వృత్తిపరమైనది. అప్పుడు ఉద్యోగికి వైద్య ఖర్చులు యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. గాయపడిన ఉద్యోగికి యజమాన్యం తగిన వైద్యం చేయించకపోతే పరిహారం కోసం ఉద్యోగి దావా వేయవచ్చు.

ఓవర్ టైమ్​ డ్యూటీకి జీతం
ఉద్యోగులు ఓవర్ టైమ్, సెలవు రోజు పనిచేస్తే వారికి తప్పని సరిగా అదనపు జీతం చెల్లించాలి. కార్మికులకు వారు పనిచేసిన అదనపు పని గంటలకు జీతం ఇవ్వాలి. లేకపోతే చెల్లించని వేతనాల కోసం యజమానిపై ఉద్యోగులు దావా వేయవచ్చు. ఉద్యోగులు కనీస వేతనం, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను పొందే హక్కు కూడా ఉంది.

వివక్ష, వేధింపులపై ఫిర్యాదు చేసే హక్కు
ఆఫీసులో తోటి ఉద్యోగుల నుంచి వేధింపులు, వివక్షతకు గురైతే యాజమాన్యానికి ఫిర్యాదు చేయవచ్చు. అదే యాజమాన్యమే ఉద్యోగిపై వివక్ష చూపిస్తే, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. పని విషయంలో వివక్ష ఎదుర్కొన్నా ఫిర్యాదు చేయొచ్చు.

పదే పదే ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే జాబ్​ గ్యారెంటీ! - Interview Tips For Beginners

'అమ్మాయిలూ.. ఈ కోర్స్ చేయండి.. మన ఫ్యూచర్ సూపర్!'- ఇషా అంబానీ సలహా - Isha Ambani Special Advice

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.