ETV Bharat / bharat

మోసపోయిన మహిళా లాయర్- నగ్నంగా వీడియో కాల్​, రూ.15లక్షలు లాస్- డ్రగ్స్ టెస్ట్ పేరుతో దోపిడీ - Woman Lawyer Case On Fake Officers

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 12:55 PM IST

Updated : Apr 10, 2024, 2:37 PM IST

Woman Lawyer Case On Fake Officers : ఓ మహిళా న్యాయవాదిని ముంబయి పోలీసులమని​ నమ్మించారు కొందరు దుండగులు. మహిళ పేరిట ముంబయి​ నుంచి థాయ్​లాండ్​కు డెలివర్​ చేయాల్సిన డ్రగ్స్​ ప్యాకేజ్​ను ఆపామని​ అన్నారు. దీనిపై సైబర్​ క్రైమ్​ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్కైప్​లో తనను వీడియో కాల్​ చేయమని అడిగారు. అనంతరం బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసి లక్షలు కాజేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

Bengaluru Woman Lawyer Made To Strip By Fraudsters
Bengaluru Woman Lawyer Case On Fake Customs Officers

Woman Lawyer Case On Fake Officers : ముంబయి పోలీసులమని నమ్మించి తనను వీడియో కాల్​లో బట్టలు విప్పమని కొందరు దుండగులు అడిగారని ఓ మహిళా న్యాయవాది సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తన వద్ద రూ.15 లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

ఫిర్యాదులో ఏముందంటే?
Woman Lawyer In Bengaluru Forced To Strip By Scammers : బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం- ఏప్రిల్ 3న ఫెడెక్స్ కంపెనీకి చెందిన ఓ ప్రతినిధి మహిళా న్యాయవాదిని సంప్రదించాడు. ముంబయి నుంచి థాయ్​లాండ్​కు పంపాల్సిన ఓ పార్శిల్​ మీ పేరుపై ఉందని నమ్మబలికాడు. ఇందులో 5 పాస్‌పోర్ట్‌లు, 3 క్రెడిట్ కార్డ్‌లతో పాటు 140 MDMA మత్తుపదార్థాలు ఉన్నాయని చెప్పాడు. అయితే 'ఇందులో డ్రగ్స్​ ఉన్న కారణంగా వాటిని కొరియర్​ చేయకుండా మేము ఆపాం. దీనిపై ముంబయిలోని సైబర్​ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. అయితే ఇందుకు మీరు ముందుగా స్కైప్​లో వీడియో కాల్​ చేయండి. ఈ కాల్​ను మేము వారికి (సైబర్​ క్రైమ్​కు) ట్రాన్స్​ఫర్​ చేస్తాం' అని సదరు మహిళా న్యాయవాదిని అడిగాడు ఫేక్​ ఆఫీసర్​. దీంతో ఆమె వెంటనే స్కైప్​ను డౌన్​లోడ్​ చేసుకొని సదరు నకిలీ అధికారికి వీడియో కాల్​ చేశారు.

ఈ కాల్​లో అతడు పార్శిల్​కు సంబంధించిన వివరాలతో పాటు బాధిత మహిళ ఆధార్​ వివరాలనూ సేకరించాడు. అనంతరం ఆ స్కైప్​ కాల్​ అభిషేక్​ చౌహాన్​ పేరుగల సీనియర్​ సీబీఐ ఆఫీసర్​కు ట్రాన్స్​ఫర్​ అయింది. ఈ సమయంలో మహిళ స్కైప్​ మాట్లాడుతున్న డివైజ్​కు సంబంధించి కెమెరాను ఆన్​ చేయమని అడిగాడు నకిలీ పోలీస్​. అప్పుడు ఇంటి చిరునామా, బ్యాంక్​ అకౌంట్​, వార్షిక ఆదాయం, నెలవారీ ఆదాయం, పెట్టుబడులు సహా అనేక వివరాలను కేటుగాడు న్యాయవాది నుంచి సేకరించాడు. తనపై మానవ అక్రమ రవాణా, మనీలాండరింగ్​ సహా ఇతర దొంగతనం కేసులు ఉన్నాయని నిందితుడు తనతో అన్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు మహిళ.

రోజంతా కెమెరాను ఆన్​లోనే ఉంచి స్క్రీన్‌ను షేర్​ ఆప్షన్​నూ ఎనేబుల్ చేసి పడుకోవాలని సైబర్​ నేరగాళ్లు ఆ మహిళను అడిగారు. ఆ మరుసటి రోజు ఏప్రిల్ 4వ తేదీన రాత్రి 11:30 గంటలకు అభిషేక్ చౌహాన్ అనే వ్యక్తి ఫోన్ చేసి వాస్తవాలను తేల్చేందుకు తన ఖాతాలోని డబ్బు మొత్తాన్ని ఓ నకిలీ ఖాతాకు బదిలీ చేయాలని సూచించాడు. దీంతో ఆ మహిళ తన ఖాతాలో ఉన్న రూ.10.78 లక్షలను నితిన్​ జోసెఫ్ అనే నిందితుడి ఖాతాకు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆ తరువాత నిందితుడు మహిళను ఇంట్లోనే కూర్చొమని తదుపరి సూచనల వచ్చేవరకు అలాగే వేచి ఉండాలని కోరాడు.

ఇక 2 గంటల తర్వాత సైబర్​ కేటుగాడు మళ్లీ మహిళకు ఫోన్​ చేసి మీ క్రెడిట్ కార్డ్ లావాదేవీలకు సంబంధించి కొన్నింటిలో లోపాలను గుర్తించాం. వీటిని సవరించేందుకు మీరు Bitget అనే యాప్‌ను ఇన్​స్టాల్​ చేసి అందులో క్రెడిట్ కార్డ్​, బ్యాంక్​ వివరాలను నమోదు చేయాల్సిందిగా అడిగాడు. అతడు చెప్పిన విధంగా చేసిన బాధిత మహిళ. ఈ క్రమంలో 5000 అమెరికా డాలర్ల విలువైన బిట్‌కాయిన్‌లను కొనుగోలు చేసే ప్రయత్నాన్ని యాప్​ తిరస్కరించినట్లుగా ఆమె తెలిపారు. ఆ తర్వాత క్రెడిట్‌ కార్డు ముందు, వెనుక ఫొటోలను తనకు షేర్​ చేయాలని నిందితుడు అడిగినట్లుగా మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

'నార్కోటిక్​​ పరీక్ష కోసం స్కైప్​లో నన్ను బట్టలు విప్పమని నిందితులు అడిగారు. న్యూడ్​ వీడియోలు తీసి తమకు పంపమని కోరారు. లేదంటే డ్రగ్స్​ కేసులో నన్ను, నా కుటుంబాన్ని అరెస్ట్​ చేస్తామని బ్లాక్​మెయిల్ చేశారు. ఏప్రిల్​ 5న మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కైప్​లో వారు రికార్డు చేసిన వీడియోను డార్క్​ వెబ్‌ సహా అనేక సైట్​లలో విక్రయానికి ఉంచుతామని అభిషేక్ చౌహాన్​ అనే వ్యక్తి నన్ను బెదిరించాడు' అని బాధిత మహిళా న్యాయవాది ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఛత్తీస్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం- బస్సు బోల్తా పడి 12 మంది మృతి - Chhattisgarh Accident Today

ఒకే కుటుంబం- 1200 మంది ఓటర్లు- అభ్యర్థులందరి చూపు ఆయనపైనే! - 1200 Voters In One Family In Assam

Last Updated :Apr 10, 2024, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.