ETV Bharat / bharat

పట్టపగలే దొంగల బీభత్సం- రూ.7లక్షలు లూటీ- సినీ ఫక్కీలో ఫ్యామిలీ కిడ్నాప్​ - Robbery In Dehradun

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 11:02 AM IST

Updated : Apr 14, 2024, 11:39 AM IST

Robbery In Dehradun : పట్టగలే ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బెదిరించి రూ.7.5లక్షల నగదు, 20 తులాల బంగారం ఆభరణాలను దోచుకెళ్లారు ముగ్గురు దొంగలు. అనంతరం ఆ కుటుంబంలోని ఇద్దరి సభ్యులను కిడ్నాప్ చేసి కొంత దూరం తీసుకెళ్లాక కారుతో సహా వారిని విడిచిపెట్టారు. అక్కడితో ఆగకుండా త్వరలో రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​లో జరిగింది.

Robbery In Dehradun
Robbery In Dehradun

Robbery In Dehradun : సినీ ఫక్కీలో ముగ్గురు దుండగులు పట్టగలే ఓ ఇంట్లోకి ప్రవేశించి కుటుంబ సభ్యులను కత్తితో​ బెదిరించి దోపడీకి పాల్పడ్డారు. రూ.7.5లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులను కిడ్నాప్​ చేసి కొంత దూరం తీసుకెళ్లాక, వారిని వదిలిపెట్టి పరారయ్యారు. ఈ ఘటన ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్‌లో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, నాగరిక ప్రాంతంలోని పెర్ల్​​ హైట్స్ సొసైటీలోని ఆరవ అంతస్తులో వికాస్​ త్యాగి అనే పండ్ల వ్యాపారి తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముగ్గురు దుండగులు వికాస్ త్యాగి ఇంటికి వచ్చి, కాలింగ్ బెల్​ కొట్టి కత్తితో బెదిరించి మరి లోపలికి ప్రవేశించారు. అనంతర వికాస్ త్యాగి కుటుంబ సభ్యులను బందీలుగా చేశారు. దాదాపు మూడు గంటల పాటు ఇంట్లోనే ఉండి సుమారు రూ.7.5 లక్షలు, 20 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అంతేకాకుండా వికాస్​ కారులోనే అతడి కుమారుడు, సోదరుడిని కిడ్నాప్ చేసారు దుండగులు.

అయితే ఉత్తరాఖండ్ సరిహద్దు దాటిన తర్వాత దుండగులు వికాస్ త్యాగి, అతడి కుటుంబ సభ్యులను కారుతో సహా వదిలేసి అక్కడి నుంచి పరాయర్యారు. కాగా దుండగులు వెళ్తూ త్వరలో రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వికాస్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 3-4 గంటల తర్వాత వికాస్ త్యాగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేస నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు.

కస్టమర్స్​లా జువెల్లరీ షాప్​లోకి చొరబడి యజమానిపై దాడి
Attack On Jewellery Shop Owner : ఇటీవలే ఉత్తరాఖండ్​ దెహ్రాదూన్‌ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆభరణాల చోరీ కోసం కస్టమర్స్​లా నగల దుకాణంలోకి చొరబడి, వెంట తెచ్చుకున్న ఆయుధాలతో యజమానిపై దాడికి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు షాప్​లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్​ అయ్యాయి. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

బాలీవుడ్ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన దుండగులు - Firing outside Salman Khan Home

బోర్నవిటా హెల్త్ డ్రింక్ కాదు- వాటిని ఆ కేటగిరీ నుంచి తొలగించాలని కేంద్రం ఆదేశం - Bournvita Is Not A Health Drink

Last Updated : Apr 14, 2024, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.