ETV Bharat / bharat

బైక్​ హ్యాండిల్​ వదిలి 112కి.మీ డ్రైవింగ్​- 74ఏళ్ల వయసులో వ్యాపారవేత్త విన్యాసాలు- ఇండియా వరల్డ్ రికార్డ్స్​లో చోటు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 21, 2024, 10:49 PM IST

Riding Bike Without Hands Balwinder Singh : అనుకున్నది సాధించాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించారు పంజాబ్​కు చెందిన 74ఏళ్ల వ్యాపారవేత్త. బైక్​ను​ హ్యాండిల్​ పట్టుకోకుండా ఏకంగా 112.4కి.మీ నడిపారు. తన 40 ఏళ్ల కిందటి కోరికను నెరవేర్చుకున్నానని చెబుతున్నారు వ్యాపారవేత్త.

Riding Bike Without Hands Balwinder Singh
Riding Bike Without Hands Balwinder Singh

74ఏళ్ల వయసులో వ్యాపారవేత్త విన్యాసాలు- హ్యాండిల్​ వదిలి 112కి.మీ డ్రైవింగ్​

Riding Bike Without Hands Balwinder Singh : 74ఏళ్ల వయసులో బైక్​పై స్టంట్స్​ చేస్తూ ఔరా అనిపించారు పంజాబ్​కు చెందిన ఓ వ్యాపారవేత్త. 112.4 కిలోమీటర్లు హ్యాండిల్​ను చేతితో పట్టుకోకుండా బైక్​ను నడిపారు. ఈ క్రమంలో ఆయన ఇండియా బుక్​ ఆఫ్ రికార్డ్స్​లో చోటు దక్కించుకున్నారు. ఆయనే ఫరీద్​కోట్ జిల్లాకు చెందిన బల్వీందర్ సింగ్.

Riding Bike Without Hands Balwinder Singh
బైక్ నడుపుతున్న బల్వీందర్ సింగ్

తనకు 40 ఏళ్ల క్రితం నుంచి బైక్​ను హ్యాండిల్​ను పట్టుకోకుండా నడపాలనే కోరిక ఉందని వ్యాపారవేత్త బల్వీందర్ సింగ్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ఏదైనా భిన్నంగా చేయాలనే తపనతో ఉండేవాడినని, అందుకే బైక్​పై స్టంట్స్​ చేశానని తెలిపారు. తాను బైక్ నడుపుతున్నప్పుడు వీడియోను తీయించానని పేర్కొన్నారు. తనతో పాటు ఒక వ్యక్తి, అంబులెన్స్ కూడా ఉందని వెల్లడించారు.

Riding Bike Without Hands Balwinder Singh
బల్వీందర్ సింగ్
Riding Bike Without Hands Balwinder Singh
బైక్ నడుపుతున్న బల్వీందర్ సింగ్

"లైవ్ వీడియో తీసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి పంపాను. 2023 నవంబర్ 16న మఖూ నుంచి బఠిండా వరకు మోటార్‌సైకిల్‌పై 112.4 కి.మీ ప్రయాణించి రికార్డు సాధించాను. బఠిండాలో ఓ గొయ్యి అడ్డు వచ్చింది. లేదంటే మరింత దూరం ప్రయాణించేవాడ్ని. భారత్‌లో ఇంత దూరం బైక్​ హ్యాండిల్ పట్టుకోకుండా బైక్ నడపిన వ్యక్తిని నేనే. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. నా తర్వాత లక్ష్యం 200కిలోమీటర్లు బైక్ హ్యాండిల్ పట్టుకోకుండా నడపడమే."
-బల్వీందర్ సింగ్, వ్యాపారవేత్త

తలపై చెరుకు గడలతో 14కి.మీ సైక్లింగ్
Old Man Rides Bicycle Viral Video : తలపై చెరుకు గడలతో 14 కిలోమీటర్లు సైక్లింగ్​ చేశారు ఓ వృద్ధుడు. సంక్రాంతి పండుగ కానుకగా తన కుమార్తెకు చెరుకు గడలు ఇచ్చేందుకు ఈ సాహసం చేశారు తమిళనాడు పూదుకొట్టైకు చెందిన చెల్లాదురై. ముందుగా చెరుకు గడలు అన్నింటినీ కట్ట కట్టారు. కూతురి కోసం మరికొన్ని వస్తువులను సంచుల్లో పెట్టి, వాటిని సైకిల్​ క్యారేజ్​కు అమర్చారు. ప్రయాణం సాఫీగా సాగాలని సైకిల్​కు పూజ చేశారు. చెరుకు గడల కట్టను తలపై జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ సైకిల్​ ఎక్కారు. సైకిల్​పై దూసుకెళ్తున్న పెద్దాయనను చూసి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు ఆశ్చర్యపోయారు. కొందరు బైక్స్​పై పక్కనే ప్రయాణిస్తూ, ఆయనను ఉత్సాహపరిచారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

103ఏళ్ల వయసులో తాత మూడో పెళ్లి- అలా ఉండలేకనట!

PHD చేసిన 89 ఏళ్ల వృద్ధుడు- తొలి సీనియర్​ గ్రాడ్యుయేట్​గా రికార్డు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.