ETV Bharat / bharat

మద్యం మత్తులో పక్కింటి బాలుడి హత్య- పొలంలో మృతదేహం వేసి పరార్​- పీక్కు తిన్న జంతువులు

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 10:40 AM IST

Neighbor Killed 6year Old Child in Aligarh : మద్యం మత్తులో పక్కింటి ఆరేళ్ల బాలుడిని హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం మృతదేహాన్ని పంట పొలంలో పడేశాడు. దీంతో అడవి జంతువులు బాలుడి శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​​లో జరిగింది.

Neighbor Killed 6year Old Child in Aligarh
Neighbor Killed 6year Old Child in Aligarh

Neighbor Killed 6year Old Child in Aligarh : మద్యం మత్తులో పక్కింటి బాలుడిని గొంతు నులిమి హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం మృతదేహాన్ని పంట పొలంలో పడేయగా, అడవి జంతువులు శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​లో ఫిబ్రవరి 6న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
కౌడియాగంజ్​ ప్రాంతానికి చెందిన గుల్షర్​ కుమారుడు ఆరేళ్ల ముద్దాసిర్​, ఫిబ్రవరి 6న సరకులు కొనేందుకు దుకాణానికి వెళ్లాడు. చాలా సేపు గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పక్కింటి వ్యక్తిపైనే అనుమానం ఉందంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేశానంటూ పోలీసుల ఎదుట అంగీకరించాడు.

మద్యం మత్తులో ఈ హత్యకు పాల్పడ్డానంటూ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. వీధిలో నుంచి బాలుడిని ఎత్తుకెళ్లి అడవిలో తీసుకెళ్లానని, అక్కడే గొంతు నులిమి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పక్కనే ఉన్న పంట పొలంలో పడేసి అక్కడి నుంచి పారిపోయాడు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని పడేసిన ప్రదేశానికి వెళ్లి చూడగా, శరీర భాగాలు ఛిద్రమైపోయాయి. బాలుడి మృతదేహాన్ని అడవి జంతువులు తిని ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. శరీర భాగాలను తీసుకుని శవపరర పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు. కాగా హత్యకు గల కారణం ఏంటనే విషయం ఇప్పటికి తెలియరాలేదు.

14 ఏళ్ల బాలుడిని హత్య చేసిన ఫ్రెండ్స్
Boy killed by his friends : కొన్ని నెలల క్రితం ఝార్ఘండ్​లోని దేవ​ఘర్​ జిల్లాలోనూ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఓ 14 ఏళ్ల బాలుడిని అతని స్నేహితులే అతికిరాతకంగా హత్య చేశారు. కాళ్లు, చేతులు నరికి మృతదేహాన్ని సంచుల్లో పెట్టి అటవీ ప్రాంతంలో పడేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.