ETV Bharat / bharat

వైఎస్సార్​సీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 23, 2024, 10:59 AM IST

Updated : Jan 23, 2024, 11:14 AM IST

mp_lavu_srikrishna_devarayalu_resigns_to_ysrcp
mp_lavu_srikrishna_devarayalu_resigns_to_ysrcp

10:54 January 23

ఎంపీ పదవికీ రాజీనామా

MP Lavu Srikrishna Devarayalu: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీకి ఎన్నికలు సమీపీస్తున్న గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. అధిష్టానంపై అసమ్మతితో ఉన్న నేతలందరూ పార్టీని వీడుతుండగా, తాజాగా మరో ఎంపీ పార్టీకి రాజీనామా చేశారు. గత కొంతకాలంగా పార్టీలో మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం ఈ తీసుకున్నట్లు రాజీనామా చేసిన ఎంపీ వివరించారు.

వైఎస్సార్సీపీకి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. కేవలం పార్టీకీ మాత్రమే కాకుండా, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. కొంతకాలంగా పార్టీలో మారిన పరిస్థితుల దృష్ట్యా రాజీనామా చేసినట్లు ఆయన వివరించారు. నాలుగున్నరేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేసినట్లు ఆయన వివరించారు. రాజకీయంగా పార్టీలో కొంత అనిశ్చితి ఏర్పడిందని, ఎంపీ స్థానంలో కొత్త అభ్యర్థిని పార్టీ ఎంపిక చేయాలని ఆలోచిస్తోందని లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. పార్టీలో అనిశ్చితి తన వల్ల రాలేదని దానికి తాను బాధ్యుడిని తాను కాదని ఆయన తెలిపారు.

Last Updated :Jan 23, 2024, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.