ETV Bharat / bharat

'రాహుల్​ది కొత్త రకం ఫొటోషూట్- 2024లో కాంగ్రెస్​కు 40 సీట్లు కూడా రావు'

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 10:58 PM IST

Mamata Banerjee On Congress : కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీపై బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భారత్​ జోడో న్యాయ్​ యాత్రలో ఆయన కొత్త రకం ఫొటోషూట్​ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​కు లోక్​సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా వస్తాయో రావో అని అన్నారు.

Mamata Banerjee On Congress
Mamata Banerjee On Congress

Mamata Banerjee On Congress : 2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​కు 40 సీట్లు కూడా రావడం అనుమానమే అని బంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​తో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ​పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 48 రోజుల దీక్ష చేపట్టిన మమత ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

వారివి బుజ్జగింపు రాజకీయాలు!
దేశంలోని 300 లోక్​సభ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్​కు తాము చెప్పినట్లు మమతా బెనర్జీ తెలిపారు. ప్రాంతీయ పార్టీలు 243 సీట్లలో పోటీ చేస్తాయని పేర్కొన్నట్లు వెల్లడించారు. 'ఎవరికి ఎక్కడ బలం ఉంటుందో అక్కడ వారు పోరాడాలని చెప్పాం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ బంగాల్​కు వచ్చి ఇక్కడి ముస్లిం ఓట్లు, బీజేపీ హిందువుల ఓట్లను రాబట్టేలా బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నాయి. కానీ మేము మాత్రం హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవుల కోసం పని చేస్తున్నాం' అని మమతా చెప్పారు.

'కాంగ్రెస్​ 300కి 40 సీట్లు గెలుస్తుందో లేదో నాకు తెలియదు. కానీ అంత అహంకారం ఎందుకు మీకు. రాహుల్​ గాందీ భారత్​ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బంగాల్​కు వచ్చారు. ఆ విషయం నాకు తెలియదు. ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. మనం ఇండియా కూటమిలో ఉన్నాం. అయినా నాకు సమాచారం ఇవ్వలేదు. మీకు దమ్ముంటే వారణాసిలో బీజేపీని ఓడించండి. మీరు గతంలో గెలిచిన స్థానాల్లో ఈసారి ఓడిపోతారు.'
--మమతా బెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

బీజేపీని ఢీకొట్టేది మేమే!
బీజేపీతో పోరాడగలిగేది తృణమూల్​ కాంగ్రెస్​ మాత్రమే అని మమతా అన్నారు. అయితే ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ ఒంటరిగా ఏకతాటిపైకి తీసుకురాలేదని, తాము ఆ పని చేయగలమని చెప్పారు. బంగాల్​కు ఎందుకు వచ్చారని ప్రశ్నించిన మమతా, కాంగ్రెస్​కు దమ్ముంటే ఉత్తర్​ప్రదేశ్, రాజస్థాన్​కు వెళ్లి బీజేపీని ఓడించాలని సవాల్​ చేశారు. అంతేకాకుండా మణిపుర్ అంశాన్ని లేవనెత్తిన మమత, అక్కడ అల్లర్లు జరిగినప్పుడు తాను వెళ్లాలనుకున్నట్లు తెలిపారు. కానీ తనను అనుమతించలేదని చెప్పారు. కానీ తన ప్రతనిధి బృందాన్ని పంపినట్లు తెలిపారు.

'మణిపుర్​లో 200 చర్చిలు తగులబెట్టారు. ఇప్పుడు అక్కడ కొత్త ఫొటోషూట్​ జరుగుతోంది (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ). టీ దుకాణంలో ఎప్పుడూ కూర్చోని వారికి టీ ఎలా చేయాలో తెలియదు. వారు ఎప్పుడూ పిల్లలను ప్రేమించలేదు, వారిని అర్థం చేసుకోలేదు. వారికి బీడి ఎలా చుడతారో కూడా తెలియదు. కానీ వారు ఇప్పుడు కెమెరా ముందు ఇవన్నీ చేస్తున్నారు' అంటూ మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు.

టార్గెట్ 2026- విజయ్ పార్టీ వ్యూహాలేంటి? 'మాస్టర్' ప్లాన్ ఇదేనా?

డీకే సురేశ్ 'దేశ విభజన' వ్యాఖ్యలు- పార్లమెంట్​లో దుమారం- సోనియా సారీ చెప్పాలని BJP డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.