ఓటర్లకు బంపర్​ ఆఫర్​- ఓటు వేస్తే హోటళ్లలో ఫ్రీ ఫుడ్​- హైకోర్టు గ్రీన్​ సిగ్నల్​ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 10:44 AM IST

Free Food For Voters In Karnataka
Free Food For Voters In Karnataka ()

Free Food For Voters In Karnataka : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే కస్టమర్లకు ఉచితంగా ఆహారం అందించాలని బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. అందుకు బీబీఎంపీ అడ్డుచెప్పగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది బెంగళూరు హోటల్ అసోసియేషన్. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన హైకోర్టు హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని సమర్థించింది.

Free Food For Voters In Karnataka : లోక్‌ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే వారికి ఉచితంగా ఆహారం అందించాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించింది. ఓటు వేసేందుకు వచ్చేవారికి ఉచితంగా భోజనం పెట్టేందుకు బెంగళూరు హోటల్ అసోసియేషన్​కు న్యాయస్థానం అనుమతినిచ్చింది. అయితే, అంతకుముందు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చే కస్టమర్లకు ఉచిత ఆహారం పెట్టాలన్న బెంగళూరు హోటల్ అసోసియేషన్ నిర్ణయంపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగళూరు హోటల్ అసోసియేషన్, నిసర్గ గ్రాండ్ హోటల్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ సభ్య ధర్మాసనం విచారించింది.

ఎలాంటి దురుద్దేశం లేదు
లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హోటల్​కు వచ్చిన కస్టమర్లకు ఉచిత ఆహారం పెట్టడం వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు ముందు వాదనలు వినిపించారు. లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్​ను పెంచేందుకే ఈ పనిని చేపట్టామని తెలిపారు. పోలింగ్ శాతాన్ని పెంచేందుకు గతంలో కూడా ఉచితంగా భోజనం పంపిణీ చేశామన్నారు. కాబట్టి తమ నిర్ణయాన్ని అనుమతించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఇరువర్గాల వాదనలు విన్న కర్ణాటక హైకోర్టు, ఎక్కువ శాతం ఓటింగ్‌ జరగాలనే సదుద్దేశంతో ఉచితంగా ఆహారం అందించాలన్న బెంగళూరు హోటల్‌ అసోసియేషన్‌ నిర్ణయాన్ని సమర్థించింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పిటిషనర్ మంచి మనసును మెచ్చుకుంది.

కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకుగానూ రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 26, మే 7న ఓటింగ్ జరగనుంది. కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఖాతాలో వేసుకోవాలని బీజేపీ, జేడీఎస్​తో జట్టు కట్టింది. కాంగ్రెస్ కూడా రెండంకెల సీట్లలో విజయం సాధించాలని ఆశపడుతోంది. ప్రధాని మోదీ కరిష్మా, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్​పై వ్యతిరేకత విజయం తెచ్చిపెడుతుందని బీజేపీ భావిస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న సానుకూలత తమకు కలిసి వస్తుందని ఆశపడుతోంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నీ తామై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అలాగే బీజేపీ తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, మాజీ సీఎం యడియూరప్ప తదితరులు ప్రచారం చేస్తున్నారు.

'10 రోజుల్లోనే MBA'- ఇలాంటి వాటితో జాగ్రత్తంటూ UGC వార్నింగ్​ - ugc on fake degree certificate

కర్ణాటకలో చక్రం తిప్పేది మనోళ్లే- లోక్​సభ ఎన్నికల్లో తెలుగు ఓటర్లు కీలకం- మద్దతు ఎవరికో? - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.