ETV Bharat / bharat

రైలు బోగీలో సిలిండర్లు బ్లాస్ట్​- భారీగా ఎగసిపడ్డ మంటలు- లక్కీగా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 10:07 PM IST

Updated : Mar 16, 2024, 10:47 PM IST

Fire In Train Compartment In Haryana
Fire In Train Compartment In Haryana

Fire In Train Compartment In Haryana : రైలు బోగీలో మంటలు చెలరేగడం వల్ల అందులో ఉన్న మూడు సిలిండర్​లు ఒక్కసారిగా పేలాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్​లో జరిగింది.

Fire In Train Compartment In Haryana : రైలు బోగీలో ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించి మూడు సిలిండర్లు పేలాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటన హరియాణాలోని అంబాలా సిటీ రైల్వే స్టేషన్​లో జరిగింది. బోగీ నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల స్థానికంగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది చాలా సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అంబాలా సిటీ రైల్వే స్టేషన్​లో సమీపంలో ఉన్న రైలు బోగీ నిలిపి ఉంది. దానిని రైల్వే ఉద్యోగుల కోసం కేటాయించారు. అయితే రైల్వే సిబ్బంది వంట వండుతున్న సమయంలో మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ఉన్న మూడు సిలిండర్​లలో ఒకటి పేలింది. ఆ తర్వాత మిగతా రెండు కూడా పేలిపోయాయి. దీంతో బోగీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంపై గురించి తెలుసుకున్న స్టేషన్ మాస్టర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్​ సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

రైలు బోగీలో మంటలు- 10మంది మృతి
ఇలాంటి ఘటనే గతేడాది ఆగస్టులో జరిగింది. తమిళనాడులోని మదురై రైల్వే స్టేషన్​ వద్ద ఆగి ఉన్న​ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మంది పర్యటకులు మృతి చెందారు. దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణాదిలో ఆధ్యాత్మిక దర్శనం కోసం ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూ నుంచి ఆగస్టు 17న ఓ టూరిస్ట్​ రైలు బయలుదేరింది. అందులో 60 మందికి పైగా యాత్రికులు తమిళనాడు నాగర్​కోయిల్​లోని పద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకుని రైలులో మదురై చేరుకున్నారు. అయితే ఆ రైలు మదురై రైల్వే స్టేషన్​కు ఒక కిలో మీటరు దూరంలో నిలిచిపోయింది. ఈ క్రమంలో తమతో పాటు తెచ్చుకున్న సిలిండర్​ను ఉపయోగించి టీ తయారు చేసుకుందామనుకున్నారు. అయితే టీ చేసుకునే ప్రయత్నంలో సిలిండర్‌ పేలి మంటలు చెలరేగాయి. వెంటనే ఆ మంటలు రెండు కోచ్​లకు వ్యాపించాయి. మంటలు చెలరేగిన వెంటనే కొంతమంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగారు. అయితే కొందరు అందులోనే చిక్కుకుపోయి మరణించారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి

Fire In Express Train : ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్​లోనే..
కాజీపేట రైల్వే స్టేషన్​ యార్డులో అగ్ని ప్రమాదం - కాలి బూడిదైన బోగీ

Last Updated :Mar 16, 2024, 10:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.