ETV Bharat / bharat

చేతులు లేకపోయినా రెండు కాళ్లతో డ్రైవింగ్- RTO నుంచి లైసెన్స్​- రాష్ట్రంలో తొలి వ్యక్తిగా రికార్డ్​! - Disabled Person Got Licence

author img

By ETV Bharat Telugu Team

Published : May 8, 2024, 8:09 AM IST

Disabled Driving Licence : అనుకోని ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తి తన స్నేహితుల్లా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం నిరంతరం శ్రమించి రెండు కాళ్లతో కారు నడపడం నేర్చుకున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు. ఆయన గురించి ఓ సారి తెలుసుకుందాం.

డ్రైవింగ్ చేస్తున్న థాన్​సేన్
డ్రైవింగ్ చేస్తున్న థాన్​సేన్ (Source : ANI)

Disabled Driving Licence : అవయవాలు అన్ని ఉన్న కొంత మంది కారు నడపడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి రెండు చేతులు లేకున్నా పట్టుదలతో రెండు కాళ్లతో డ్రైవింగ్‌ చేసి లైసెన్స్‌ను పొంది అందరినీ అబ్బురపరుస్తున్నారు. చిన్నతనంలోనే ఓ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయినా నిరాశ చెందకుండా నిరంతర శ్రమతో ఒక కాలితో డ్రైవింగ్‌ మరో కాలితో కారు పెడళ్లను నియంత్రిస్తూ నిరంతర అభ్యాసంతో ఆసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన థాన్‌సేన్‌ గురించి తెలుసుకుందాం.

పట్టుదల ముందు!
తమిళనాడు చెన్నైలో నివసిస్తున్న 30 ఏళ్ల థాన్‌సేన్‌ తనకు పదేళ్ల వయస్సులో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో రెండు చేతులు కోల్పోయారు. 18 ఏళ్లప్పుడు తన స్నేహితులందరూ డ్రైవింగ్‌ లైసెన్స్ పొందడాన్ని చూసి తాను కూడా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందాలని ఆశపడ్డారు. కానీ తన ఆశకు రెండు చేతుల లేకపోవడం పెద్ద అవరోధంగా మారింది. అయితే థాన్‌సేన్‌ పట్టుదల శ్రమ ముందు ఆ సమస్య చిన్నబోయింది.

అసాధ్యాన్ని సుసాధ్యం!
నిరంతరం శ్రమించి రెండు కాళ్లతో కారు నడపడం నేర్చుకున్నారు థాన్ సేన్. ఒక కాలుతో స్టీరింగ్‌ అదుపు చేయడం, మరో కాలుతో పెడళ్లను నియంత్రిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అనంతరం కేకే నగర్‌ ప్రభుత్వ పునరావస కేంద్రానికి వెళ్లి తాను డ్రైవింగ్‌ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు వైద్య ధ్రువీకరణ పత్రాన్ని పొందారు. అనంతరం డ్రైవింగ్‌ పరీక్షలో పాల్గొని ఉత్తీర్ణత సాధించి డ్రైవింగ్‌ లైసెన్స్ పొంది తన కళను థాన్‌సేన్‌ సాకారం చేసుకున్నారు.

Disabled Driving Licence
డ్రైవింగ్ చేస్తున్న థాన్​సేన్ (Source : ANI)

దృఢసంకల్పంతో!
థాన్‌సేన్‌ 2024 ఏప్రిల్‌ 22న డ్రైవింగ్‌ లైసెన్స్‌ను పొందారు. రెండు కాళ్లతో కారును నడుపుతున్న థాన్‌సేన్‌ తమిళనాడులో ఈ ప్రమణాలతో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందిన మొదటి వ్యక్తిగా నిలిచారు. తన స్నేహితులు డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందడం చూసి తాను డ్రైవింగ్‌ చేయలేకపోవడం నిరాశకు గురిచేసిందని థాన్‌సేన్‌ తెలిపారు. అనంతరం కొన్నేళ్లకు భారత్‌లో చేతులు లేకుండా డ్రైవింగ్‌ లైసెన్స్ పొందిన మొదటి వ్యక్తి మధ్యప్రదేశ్‌కు అగ్నిహోత్రి గురించి తెలిసిందన్నారు. ఆయన ప్రేరణతోనే తాను డ్రైవింగ్‌ చేయగలన్న దృఢసంకల్పంతో నిరంతరం సాధన చేసి తన లక్ష్యం సాధించినట్లు వెల్లడించారు.

గుడిలో ముస్లిం దివ్యాంగురాలి పాఠాలు.. ఎర్రకోట సాక్షిగా పేద పిల్లలకు కానిస్టేబుల్​ విద్యాదానం​​

పగలు డెలివరీ బాయ్.. రాత్రి సెక్యూరిటీగార్డ్.. భిక్షాటన మానేసి కుటుంబాన్ని పోషిస్తున్న దివ్యాంగుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.