ETV Bharat / bharat

సీఎం ర్యాలీలో భద్రతా వైఫల్యం- ఏకంగా గన్​ను అక్కడ పెట్టుకొని పూలమాలలు వేసిన కార్యకర్త! - CM Security Breach In Karnataka

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 8:30 AM IST

CM Security Breach In Karnataka
CM Security Breach In Karnataka

CM Security Breach In Karnataka : కర్ణాటకలో ఓ కాంగ్రెస్​ కార్యకర్త ఏకంగా తనవద్ద గన్​ను పెట్టుకొని మరీ సీఎం సిద్ధరామయ్యకు పూలమాల వేశాడు. ఎన్నికల్లో భాగంగా తమ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రికి ఈ అనుభవం ఎదురైంది. దీంతో ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

CM Security Breach In Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు ఓ కాంగ్రెస్​ కార్యకర్త ఏకంగా తుపాకీతో వచ్చాడు. నడుము భాగంలో దానిని పెట్టుకొని వెళ్లి సీఎంకు పూలమాల వేశాడు. ఈ ఘటనా దృశ్యాలు అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన ప్రతిపక్షాలు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.

నడుముకు గన్​తో ప్రచార వాహనంపైకి!
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధరామయ్య సోమవారం బెంగుళూరులో పర్యటించారు. అక్కడి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విల్సన్​ గార్డెన్​ సమీపంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన, వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి సిద్ధాపుర్‌కు చెందిన రియాజ్​ అహ్మద్​ అనే ఓ కాంగ్రెస్​ కార్యకర్త పూలదండ తీసుకొని సీఎం ఉన్న ప్రచార వాహనంపైకి ఎక్కాడు.

అయితే సిద్ధరామయ్యకు పూలమాల వేసే సమయంలో అతడి నడుము భాగాన ఓ గన్​ కనిపించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్​ అయ్యారు. వెంటనే రియాజ్​ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. నగర పోలీస్​ కమిషనర్​ బీ.దయానంద ఆదేశాల మేరకు పశ్చిమ డివిజన్​ అదనపు పోలీసు కమిషనర్​ సతీష్‌కుమార్​, సౌత్‌ డివిజన్‌ డీసీపీ లోకేష్‌ భరమప్ప జగల్‌సర్‌ అతడిని విచారించారు.

CM Security Breach In Karnataka
తుపాకీతో సీఎం ప్రచారవాహనంపైకి ఎక్కిన కార్యకర్త

'అది లైసెన్స్​ ఉన్న గన్నే'
'రియాజ్ అహ్మద్​ వద్ద లైసెన్స్​డ్​ గన్​ ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత లైసెన్స్​ పొందిన ఆయుధాలను స్థానిక పోలీస్​ స్టేషన్‌లో డిపాజిట్​ చేయాలి. కానీ, రియాజ్​ తన దగ్గరున్న తుపాకీని పోలీసులకు అప్పజెప్పలేదు. అయితే 2019లో రియాజ్​​ అహ్మద్‌పై దాడి జరిగింది. దీంతో అతడిపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో అతడు ప్రత్యేక అనుమతి తీసుకొని పిస్టోల్​ను తన వద్దే పెట్టుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతడు మా అదుపులోనే ఉన్నాడు' అని డీసీపీ లోకేష్‌ భరమప్ప జగల్‌సర్‌ తెలిపారు.

బాలీవుడ్ టు కోలీవుడ్- లోక్​సభ బరిలో ఎందరో సినీ తారలు- ఎవరెవరెంటే? - Actors In Lok Sabha Polls 2024

2024లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం- HD ఫొటోలు చూశారా? మళ్లీ 20 ఏళ్ల తర్వాతే ఇలా! - SOLAR ECLIPSE 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.