ETV Bharat / bharat

బడ్జెట్​ 2024లో వరాల జల్లు - పీఎం కిసాన్ డబ్బులు పెంపు; ఫ్రీగా రూ.10 లక్షల ఇన్సూరెన్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 12:03 PM IST

Updated : Jan 31, 2024, 3:35 PM IST

2024 Interim BUDGET Expectations
BUDGET 2024 Expectations

BUDGET 2024 Expectations In Telugu : మోదీ సర్కార్ లోక్​ సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్​పైనే అందరి దృష్టి ఉంది. ఈ బడ్జెట్లో పీఎం కిసాన్​, ఆయుష్మాన్ భారత్​, సూర్యోదయ యోజన పథకాల లబ్ధిదారులకు మరింతగా ఆర్థిక ప్రయోజనాలు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే పన్నులు, చమురు ధరలు, వంట గ్యాస్ ధరలు కూడా తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మోదీ సర్కార్ వ్యూహం ఏమిటి?

BUDGET 2024 Expectations : సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్​పైనే అందరి దృష్టి ఉంది. ముఖ్యంగా పీఎం కిసాన్, ఆయుష్మాన్ భారత్​, సూర్యోదయ యోజన మొదలైన పథకాల గురించి; పన్నులు, చమురు, వంట గ్యాస్​ ధరల తగ్గింపు మొదలైన అంశాల గురించి అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి మోదీ సర్కార్ వ్యూహం ఏంటో చూడాలి.

పీఎం కిసాన్​ యోజన
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రైతులను విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పీఎం కిసాన్​ యోజన కింద రైతులకు ఏటా రూ.6000 అందిస్తున్నారు. అయితే రైతులకు అందించే ఈ లబ్ధిని 50 శాతం మేర పెంచి, ఏడాదికి రూ.9,000 అందించాలని మోదీ సర్కార్ భావిస్తోందని సమాచారం. దీనిని మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఆయుష్మాన్ భారత్​ యోజన
కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్​ యోజన కింద ఇప్పటి వరకు రూ.5 లక్షల బీమా కవరేజీని అందిస్తోంది. అయితే దీనిని రూ.10 లక్షల వరకు పెంచుతూ బడ్జెట్లో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేకూరనుంది. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగించి కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా రూ.10 లక్షల పరిమితి మేరకు వైద్య సేవలు పొందడానికి వీలవుతుంది.

సూర్యోదయ యోజన
ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సూర్యోదయ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. కోటి ఇళ్లకు రూఫ్​టాప్ సోలార్​ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని దీని ఉద్దేశం. కర్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రీన్ ఎనర్జీస్​ను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.

కేంద్ర ప్రభుత్వం ఈ రూఫ్​టాప్ సోలార్ ప్యానల్స్ ఇన్​స్టాలేషన్​ కోసం సబ్సిడీలు అందిస్తోంది. 10 కిలోవాట్​ కెపాసిటీ ఉన్న సిస్టమ్​లకు ఈ సూర్యోదయ యోజన ఫేజ్-2 కింద కిలోవాట్​కు రూ.9 వేలు నుంచి రూ.18 వేలు వరకు సబ్సిడీ అందిస్తోంది. 10 కిలోవాట్​ల కంటే ఎక్కువ ఉన్న సిస్టమ్​లకు రూ.1,17,000 వరకు ఫిక్స్​డ్ సబ్సిడీ అందిస్తోంది. అయితే తాజా మధ్యంతర బడ్జెట్లో ఈ సబ్సిడీ అమౌంట్​ను మరింత పెంచే అవకాశం ఉందని సమాచారం.

పెట్రోల్, వంట గ్యాస్​ ధరలు తగ్గుతాయా?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు మోదీ సర్కార్​ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించవచ్చని వార్తలు వస్తున్నాయి. అలాగే వంట గ్యాస్​ సిలిండర్​ ధరలు తగ్గించడం లేదా వాటిపై సబ్సిడీలు పెంచడంగానీ చేయవచ్చని తెలుస్తోంది.

పన్నుల తగ్గింపు ఉంటుందా?
ఆదాయపన్ను చట్టం 1961 సెక్షన్​ 80డీ కింద ఆరోగ్య బీమా ప్రీమియం చెల్లింపులపై, వైద్య ఖర్చులపై ట్యాక్స్​ డిడక్షన్​ క్లెయిమ్ చేసుకోవచ్చు. సాధారణంగా 60 ఏళ్లలోపు వాళ్లు రూ.25 వేల వరకు, సీనియర్ సిటిజన్లు రూ.50 వేల వరకు ఈ ట్యాక్స్​ డిడక్షన్ కెయిమ్ చేసుకోవచ్చు. హెల్త్ చెకప్స్ కోసం రూ.5 వేల వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. కానీ నేడు ఇన్సూరెన్స్​ ప్రీమియంలు, వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. అందుకే మోదీ ప్రభుత్వం ఈ మధ్యంతర బడ్జెట్లో సెక్షన్ 80డీ కింద చేసుకునే హెల్త్ క్లెయిమ్​ పరిమితిని పెంచవచ్చని, పైగా అదనపు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా కల్పించవచ్చు అని సమాచారం.

సేవింగ్స్, పెన్షన్​ స్కీమ్స్​
కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ అకౌంట్​ హోల్డర్లకు, నేషనల్ పెన్షన్ స్కీమ్​ ఖాతాదారులకు కూడా పన్ను మినహాయింపులు కల్పించవచ్చని తెలుస్తోంది. ఇవే జరిగితే పెన్షనర్లకు, బ్యాంకు ఖాతాదారులకు మంచి లబ్ధి చేకూరుతుంది.

మీ ఫాస్టాగ్​ KYC పూర్తి చేశారా? లేదంటే ఖాతా బ్లాక్​ - ఇవాళే లాస్ట్ డేట్​!

మనీ ట్రాన్స్​ఫర్ చేస్తున్నారా? ఫిబ్రవరి 1నుంచి రూల్స్​ ఛేంజ్​! అవేంటో తెలుసుకోండి

Last Updated :Jan 31, 2024, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.