ETV Bharat / bharat

పొలంలో తండ్రి తవ్వించిన బోరుబావిలో పడ్డ రెండేళ్ల బాలుడు- కొన్నిగంటలుగా రెస్క్యూ ఆపరేషన్​! - Boy Falls Into Borewell

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 10:05 PM IST

Updated : Apr 4, 2024, 7:13 AM IST

Boy Falls Into Borewell
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

Boy Falls Into Borewell : ప్రమాదవశాత్తు రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం, సహాయక చర్యలు చేపట్టింది. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Boy Falls Into Borewell : కర్ణాటక విజయపుర జిల్లాలో పొలంలో ఉన్న బోరుబావిలో రెండేళ్ల బాలుడు ప్రమదావశాత్తు పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. బాలుడిని సాత్విక్ ముజగొండగా గుర్తించారు. కొన్ని గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ జరుపుతున్నారు అధికారులు.

Boy Falls Into Borewell
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది
Boy Falls Into Borewell
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

జిల్లాలోని లచయానా గ్రామానికి సతీశ్​ ముజగొండ తన నాలుగు ఎకరాల పొలంలో బోరుబావి తవ్వంచాడు. అయితే బుధవారం సాయంత్రం పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. సాత్విక్​ సుమారు 16 అడుగుల లోతులో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. బాలుడికి పైపుల ద్వారా ఆక్సిజన్​ అందిస్తున్నట్లు వివరించారు. బాలుడి కదలికలను గుర్తించినట్లు వెల్లడించారు. స్థానిక హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అర్చన నేతృత్వంలోని వైద్యుల బృందం ఘటనాస్థలిలో సిద్ధంగా ఉంది. సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్దలింగ మహారాజు సన్నిధిలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు స్థానికులు.

కొన్నిరోజుల క్రితం, గుజరాత్​లోని దేవ్​భూమి ద్వారక జిల్లాలో 30 అడుగుల బోరుబావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. సహాయక బృందాలు అనేక గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్​ నిర్వహించి చిన్నారిని బయటకు తీసినా లాభం లేకుండా పోయింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

జిల్లాలోని రాన్ గ్రామానికి చెందిన బాలిక ​ఏంజెల్ షఖ్రా ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిపోయింది. అది గమనించిన గ్రామస్థులు చిన్నారి రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. అధికారులకు విషయాన్ని చేరవేశారు. సమచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి స్థానిక అధికారులు చేరుకున్నారు. బోర్‌వెల్​లోకి ఆక్సిజన్‌ను పంపించారు. ఆ తర్వాత చిన్నారిని కాపాడేందుకు ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ రంగంలోకి దిగాయి. ఎల్​ ఆకారంలోని హుక్​తో బాలికను తాడుతో కట్టి 15 అడుగుల మేర పైకి తీసుకొచ్చారు. బోర్ బావికి సమాతరంగా తవ్వకాలు కూడా జరిపారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని బయటకు తీశారు. వెంటనే చికిత్స కోసం అంబులెన్స్​లో జామ్ ఖంభాలియా పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

Last Updated :Apr 4, 2024, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.