ETV Bharat / bharat

వెయిట్ అండ్ వాచ్​ మోడ్​లో కాంగ్రెస్- బిహార్​లో మళ్లీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 10:41 PM IST

Bihar Political Crisis 2024 Congress : బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మహాగఠ్‌బంధన్‌ను వీడి ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ స్పందించింది. తమ పార్టీ వెయిట్ అండ్ వాచ్​ మోడ్​లో ఉన్నట్లు తెలిపింది. నీతీశ్ వైదొలిగినా మెజారిటీతో మళ్లీ మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పింది.

Bihar Political Crisis 2024 Congress
Bihar Political Crisis 2024 Congress

Bihar Political Crisis 2024 Congress : బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ మహాకూటమిని వీడి బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరో రెండు రోజుల్లో బీజేపీ సాయంతో మళ్లీ నీతీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు అక్కడి రాజకీయాలను వేడెక్కించాయి. ఈ ఊహాగానాలపై ఇప్పటికే బీజేపీ, జేడీయూ, ఆర్​జేడీ స్పందించాయి.

అయితే మహా కూటమిలోని కాంగ్రెస్ మాత్రం వెయిట్ అండ్ వాచ్ మోడ్​లో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పారు. ఎటువంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలోని పరిణామాలపై ఇప్పటికే రాష్ట్ర ఏఐసీసీ ఇన్​ఛార్జ్ మెహన్ ప్రకాశ్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలను సేకరించారట. రాష్ట్ర పరిస్థితిని పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీకి అంతా వివరించారట.

ఒకవేళ ఊహాగానాల ప్రకారం మహాకూటమి నుంచి నీతీశ్ బయటకు వెళ్లిపోతే పాలక కూటమికి ఎలాంటి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ భావిస్తోంది. "ప్రస్తుతం మేం వెయిట్ అండ్ వాచ్ మోడ్​లో ఉన్నాం. మహాకూటమి నుంచి నీతీశ్ కుమార్ బయటకువచ్చేస్తారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంపై నేను వ్యాఖ్యలు చేయలేను. ఏదైనా జరిగితే అప్పుడు స్పందిస్తాం. అయినా ఏం జరిగినా పాలకకూటమికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటువంటి పరిణామాలకైనా మేం సిద్ధం" అని బిహార్ కాంగ్రెస్ శాసనాసభాపక్ష నేత షకీల్ అహ్మద్ ఖాన్​ తెలిపారు.

నీతీశ్ కుమార్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో చేతులు కలిపితే రాష్ట్ర అసెంబ్లీలో నంబర్ గేమ్ మొదలవ్వనుందని కాంగ్రెస్ చెబుతోంది. జేడీయూ వైదొలిగితే కూటమికి మెజారిటీకి కేవలం 8మంది ఎమ్యెల్యేలు మాత్రమే తక్కువ ఉంటారని ఓ సీనియర్ నేత తెలిపారు. అయితే ఆర్​జేడీ నేతలతో కొందరు జేడీయూ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారని చెప్పారు. వారు పార్టీ మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి మళ్లీ మెజారిటీతో మహా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చని తెలిపారు. ప్రస్తుతానికి కూటమి పటిష్ఠంగానే కనిపిస్తోంది. స్పీకర్ ఆర్జేడీ పార్టీ నేత కనుక నిబంధనల ప్రకారమే ఆయన నడుచుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అయితే నీతీశ్ కుమార్​ తమ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ఆర్​జేడీలో చేరితే ఆయన అసెంబ్లీని రద్దు చేసే అవకాశముందని వ్యాఖ్యానించారు.

  • అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య- 243
  • మహా కూటమి(జేడీయూ లేకుండా)-115
  • ఆర్​జేడీ-79
  • కాంగ్రెస్-19
  • సీపీఐ(ఎంఎల్)-12
  • సీపీఐ(ఎం)-2
  • సీపీఐ-2
  • స్వతంత్రం-1
  • మొత్తం-115 (మెజారిటీకి 8 మందే తక్కువ)

అయితే రాష్ట్రంలోని 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జాగ్రత్తగా కాపాడుకోవాలని అధిష్ఠానం రాష్ట్ర నాయకత్వాన్ని సూచించినట్లు తెలుస్తోంది. "మా 19 మంది ఎమ్మెల్యేలు మాతోనే ఉన్నారు. జనవరి 29న బిహార్‌లో ప్రవేశించే రాహుల్ గాంధీ న్యాయ్ జోడో యాత్ర, జనవరి 30న పూర్ణియాలో జరిగే ర్యాలీకి సంబంధించి ఏర్పాట్లలో మేం బిజీగా ఉన్నాము. ర్యాలీకి మా మిత్రపక్షాలందరినీ ఆహ్వానించాం. వారందరూ హాజరవుతారని మేము ఆశిస్తున్నాం" అని షకీల్ అహ్మద్ ఖాన్ తెలిపారు.

ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదని, తాము మిత్రపక్షాలతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటున్నామని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ చెప్పారు. "కొంతమంది జేడీయూ ఎమ్మెల్యేలు ఆర్​జేడీతో టచ్‌లో ఉన్నారని విన్నాను. సంక్షోభం ఏర్పడితే, అసెంబ్లీలో సంఖ్యాబలం వచ్చేలా ఏర్పాట్లు చేశాం" అని అశోక్ కుమార్ తెలిపారు.

టీపార్టీకి దూరంగా తేజస్వి- తనకు తెలియదన్న నీతీశ్​- బిహార్​లో ఏం జరుగుతోంది?

నీతీశ్‌ మరోసారి యూటర్న్‌? పదవి కోసం మిత్రపార్టీలకు ఐదుసార్లు హ్యాండ్​- ఆరోసారి తప్పదా!

'ఇండియా' కూటమికి నీతీశ్‌ గుడ్‌ బై? NDAలోకి ఎంట్రీ! అదే కారణమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.