తెలంగాణ

telangana

నగ్నంగా జేడీయూ నేత.. మద్యం మత్తులో రచ్చ రచ్చ

By

Published : Feb 24, 2022, 12:29 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

బిహార్​లో మద్య నిషేధం కోసం జేడీయూ అగ్రనేత, సీఎం నితీశ్ కుమార్​ పాటుపడుతున్న వేళ.. ఆ పార్టీ నేతనే పూటుగా తాగి నగ్నంగా తిరగడం చర్చనీయాంశమైంది. సీఎం సొంత జిల్లా నలందలో ఈ ఘటన జరిగింది. జేడీయూ ఇస్లాంపుర్​ అసెంబ్లీ నియోజకవర్గ యూత్​ ఇన్​ఛార్జి జై ప్రకాష్​ ఈ చర్యకు పాల్పడ్డాడు. తన సోదరుడితో గొడవపడి, జై ప్రకాష్​.. అతడిని తిడుతున్నట్లు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details