తెలంగాణ

telangana

భర్తను బ్యాటుతో చితకబాదిన భార్య.. వేధిస్తున్నాడని ఫిర్యాదు

By

Published : Jul 14, 2022, 8:57 AM IST

భర్త వేధింపులు తాళలేక.. భర్తను చితకబాదింది భార్య. రాజస్థాన్​ బికనీర్​లో ఈ ఘటన జరిగింది. భర్త నిద్రిస్తున్న సమయంలో బ్యాటుతో దాడి చేసింది మహిళ. గాయపడ్డ ఆ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జయనారయణ్​ వ్యాస్ కాలనీ పోలీస్​ స్టేషన్​లో భార్యపై కేసు పెట్టారు భర్త తరఫు బంధువులు. మరోవైపు భార్య కూడా తన భర్త వేధిస్తున్నాడని కేసు పెట్టింది. ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన భర్త బంధువులు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details