తెలంగాణ

telangana

PRATIDWANI : పిల్లలు బడికెందుకు రావడం లేదు?

By

Published : Aug 18, 2021, 9:19 PM IST

డ్రాపౌట్‌...! రాష్ట్రంలో దృష్టి పెట్టాల్సిన విషయంగా తెరపైకి వచ్చిన విషయం ఇది. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ - యూడైస్‌ 2019-20 గణాంకాలు ఆ ఆవశ్యకత మరింత పెంచాయి. రాష్ట్రంలో పదోతరగతికి ముందే బడికి స్వస్తి చెబుతున్న వారి లెక్కలపై ఆందోళన వ్యక్తం చేసింది యూడైస్ నివేదిక. గిరిజన, దళిత వర్గాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ప్రాథమిక దశలో ప్రవేశాల సంఖ్య బాగానే ఉన్నా.. వారిలో తర్వాత వెళ్లేకొద్దీ ఎంతమంది తరగతి గదుల్లో మిగులుతున్నారు? అయిదో తరగతి, ఏడోతరగతి... పదోతరగతి చేరే సరికి పాఠశాలలకు రావాల్సిన విద్యార్థులు ఎందుకు తగ్గిపోతున్నారు? ఇదే పరిస్థితి కొనసాగితే... విద్యావికాస లక్ష్యాల పరిస్థితి ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details