తెలంగాణ

telangana

ప్రతిధ్వని: రైతులతో చర్చల్లో ఎలాంటి సానుకూలత వ్యక్తమైంది..?

By

Published : Dec 31, 2020, 9:42 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో కొంత పురోగతి కనిపించింది. రైతు సంఘాలు ప్రతిపాదించిన నాలుగు డిమాండ్లలో రెండింటికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మూడు సాగుచట్టాలు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు సంబంధించి చర్చించడానికి జనవరి నాలుగో తేదీన మరోసారి భేటీ కావడానికి ఇరువర్గాలు అంగీకరించాయి. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో ఎలాంటి సానుకూలత వ్యక్తమైంది. పరిష్కారం దిశగా ఏవిధంగా అడుగులు పడుతున్నాయి. ఈ అంశాలపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details