తెలంగాణ

telangana

Video: కన్నుల పండువగా జగన్నాథ రథయాత్ర

By

Published : Jul 1, 2022, 3:42 PM IST

ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల మధ్య ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా గత రెండేళ్లు ఆంక్షల మధ్యే రథయాత్రను నిర్వహించారు. కానీ ఈసారి భక్తలను అనుమతించగా.. భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు విదేశీయులు కూడా పూరీ చేరుకున్నారు. నందిఘోష్‌ రథంలో జగన్నాథుడు, తాళధ్వజలో బలభద్రుడు, దర్పదళన్​లో సుభద్రను ఊరేగిస్తారు. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ABOUT THE AUTHOR

...view details