తెలంగాణ

telangana

SRSP 20 GATES OPEN: ఎస్సారెస్పీకి మళ్లీ వరద.. 20 గేట్లు ఎత్తివేత

By

Published : Oct 18, 2021, 8:17 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు మళ్లీ వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 80 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 20 ప్రధాన గేట్లను ఎత్తి 87 వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 1090.90 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 89 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ సమయంలో ప్రాజెక్టులో చేపల వేటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా 20 గేట్లు ఎత్తడంతో పాలపొంగులా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది.

ABOUT THE AUTHOR

...view details