తెలంగాణ

telangana

Young man suicides in Patancheru : బతకాలనిలేదని.. సెల్ఫీవీడియో సోదరికి పంపి.. యువకుడి ఆత్మహత్య

By

Published : Jul 23, 2023, 3:01 PM IST

suicide

Selfie video suicide in Patancheru : జీవితం మీద విరక్తితో.. యువకుడు బలవన్మరణంకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది. నన్ను ఎంతో బాగా చూసుకున్నారు.  అయినా నాకు జీవించాలని లేదు. అమ్మానాన్న మీరు మంచిగా ఉండండి అంటూ.. తన సోదరికి చరవాణిలో సెల్ఫీవీడియో పంపిన అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం రామేశ్వరంబండ కాలనీకి చెందిన శ్రీరాములు కుమారుడు.. శివకుమార్(20) పటాన్​చెరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 21న మధ్యాహ్నం దుస్తులు కుట్టించుకుంటానని టౌన్​కు వెళ్లాడు. తనకు బతకాలని లేదని.. చనిపోతానని సోదరి సోనీకి ముందుగానే వీడియో తీసి పంపాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించగా.. పెద్ద రామేశ్వరం బండ సమీపంలోనే స్థానిక ఇందిరమ్మ ఇళ్ల గృహ సముదాయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details