తెలంగాణ

telangana

Sudarshana yagam: నూతన సచివాలయంలో సుదర్శన యాగం పూర్తి

By

Published : Apr 30, 2023, 1:14 PM IST

Yaagam

Sudarshana yagam at Secretariat: రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సుదర్శన, చండీ, వాస్తు హోమాలు ముగిశాయి. పూర్ణాహుతితో యాగం పరిపూర్ణం అయింది. తొలుత ద్వారలక్ష్మి పూజ చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు.. అనంతరం యాగ క్రతువులో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సచివాలయం మారుమోగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సచివాలయానికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలో సీపీ ఆనంద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.

మధ్యాహ్నం నూతన సచివాలయం ప్రారంభోత్సవం జరగనుంది. మధ్యాహ్నం 1.20 గంటల నుంచి 1.32 మధ్య సీఎం కేసీఆర్‌ దీన్ని ప్రారంభించనున్నారు. 12 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తికానుంది. ఆ తర్వాత యాగశాలను కేసీఆర్‌ సందర్శిస్తారు. వాస్తుపూజ మందిరానికి వెళ్లిన అనంతరం.. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో ఫైల్‌పై సంతకం చేయనున్నారు. ఆ తర్వాత మంత్రులు కూడా తమకు కేటాయించిన ఛాంబర్లలో ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.58 గంటల నుంచి ఛాంబర్లకు అధికారులు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత నూతన సచివాలయం ఆవరణలో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details